News August 29, 2025
జగదేవపూర్: డెంగ్యూ వ్యాధితో విద్యార్థి మృతి

జగదేవపూర్ మండలంలోని అనంతసాగర్ గ్రామానికి చెందిన 10 ఏళ్ల బాలుడు యశ్వంత్ డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ గురువారం రాత్రి మరణించాడు. మండలంలో ఇది డెంగ్యూ కారణంగా సంభవించిన 3వ మరణం. పారిశుద్ధ్య లోపం వల్లే ఈ వ్యాధి వ్యాప్తి చెందుతోందని, అధికారులు వెంటనే దృష్టి సారించి నివారణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అధికారులు కూడా ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Similar News
News September 2, 2025
JGTL: నిబద్ధతతో సేవలందించిన మనోహర్‌కు అభినందనలు

TGNPDCL ఎలక్ట్రిసిటీ ఉద్యోగి దురిశెట్టి మనోహర్ (ADE) ఉద్యోగ విరమణ కార్యక్రమంలో కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మనోహర్ తన సేవా కాలమంతా నిబద్ధతతో, క్రమశిక్షణతో పనిచేసి శాఖకు ఒక ఆదర్శంగా నిలిచారని తెలిపారు. ఆయన కృషి, అంకితభావం సిబ్బందికి ప్రేరణగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, సహోద్యోగులు, బంధువులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.
News September 2, 2025
PGRSపై త్వరలో శిక్షణ: కలెక్టర్

CMO ఆదేశాల మేరకు త్వరలో PGRSకు సంబంధించి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహిస్తామని కలెక్టర్ అంబేద్కర్ తెలిపారు. కలెక్టరేట్‌లో సోమవారం ఆయన మాట్లాడుతూ.. PGRSపై ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రతినెలా విశ్లేషణ నిర్వహిస్తారని, అందువల్ల అధికారులంతా వచ్చిన వినతల పరిష్కారం పట్ల చిత్త శుద్ధి చూపించాలని ఆదేశించారు. అసలైన ఫిర్యాదుదారులకు న్యాయం చేకూర్చే విధంగా అధికారులు వ్యవహరించాలని సూచించారు.
News September 2, 2025
జగిత్యాల: జీతాలు విడుదల చేయాలని వినతి

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఆదర్శ పాఠశాలలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు విడుదల చేయాలని సోమవారం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్‌కు ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ.. 2025-26 సంవత్సరం మార్చ్ నుంచి ఆగస్టు నెల వరకు జీతాలను ఇంకా విడుదల చేయలేనందున ప్రభుత్వం స్పందించి జీతాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పిటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.