News October 25, 2025
జగనామ జిల్లాలో కాకతీయ అనంతర శైలి శిల్పాలు!

జగనామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామ దేవతా ఆలయ రిజర్వాయర్ వద్ద రాష్ట్రకూట, కాకతీయ అనంతర శైలికి చెందిన నాగుల శిల్పాలు, శిథిల శిల్పాలు బయటపడ్డాయి. ఇక్కడ శివలింగం పట్టుకున్న వీరుడు, నక్క వాహనం కలిగిన శిథిల చాముండి శిల్పం కూడా ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. మీ గ్రామంలో కూడా ఇలా చరిత్ర కలిగిన దేవాలయాలు, శిల్పాలు ఉంటే కామెంట్ చేయండి.
Similar News
News October 25, 2025
రేపు కురుమూర్తిస్వామి అలంకరణ మహోత్సవం

పేదల తిరుపతిగా పేరుగాంచిన చిన్నచింతకుంట మండలం అమ్మపూర్‌లోని శ్రీ కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 22నుంచి వైభవంగా ప్రారంభమయ్యాయి.ఈ ఉత్సవాలలో భాగమైన స్వామివారి అలంకరణ మహోత్సవం ఆదివారం నిర్వహించనున్నారు. ఆత్మకూరు ఎస్బీఐ బ్యాంకులో ఉన్న స్వామి వారి ఆభరణాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని స్వామివారికి అలంకరించనున్నట్లు ఆలయ ఛైర్మన్ గోవర్ధన్ రెడ్డి తెలిపారు.
News October 25, 2025
మల్దకల్: అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

జిల్లాలో పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను అరెస్టు చేసినట్లు డీఎస్పీ మొగులయ్య తెలిపారు. నిందితుల నుంచి 5.5 తులాల బంగారు, రూ.1.20 లక్షల నగదు, రెండు బైకులు, సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. గద్వాల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ టంగుటూరి శీను, మల్దకల్ ఎస్సై నందికర్ పాల్గొన్నారు. డ్యూటీలో తెగువ చూపిన కానిస్టేబుల్స్ అడ్డాకుల నవీన్, రామకృష్ణ, తిప్పారెడ్డిలను జిల్లా ఎస్పీ అభినందించారు.
News October 25, 2025
శ్రీకాకుళం: పీజీ ప్రవేశాల ప్రక్రియ పూర్తయ్యేదెప్పుడో..?

పీజీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ పూర్తికి ఎదురుచూపులు తప్పడం లేదు. ఈఏడాది జూన్ 9-12 వరకు పీజీ సెట్ జరగగా..25న ఫలితాలొచ్చాయి. సెప్టెంబర్ 22న మొదట, అక్టోబర్ 12న రెండో కౌన్సిలింగ్ నిర్వహించినా.. ఇప్పటికీ స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తికాక విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. శ్రీకాకుళం జిల్లాలోని డా.బీ.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో ఈ ఏడాది కొన్ని కోర్సుల్లో జీరో అడ్మిషన్ల్ నమోదయ్యాయి.


