News May 16, 2024
జగన్‌కు వేదపండితుల ఆశీర్వచనాలు

గుంటూరు జిల్లా తాడేపల్లిలో 41 రోజులుగా 45 మంది వేద పండితులతో శ్రీ మహా రుద్ర సహిత రాజశ్యామల సహస్ర చండీయాగం నిర్వహిస్తున్నారు. కాగా గురువారంతో ఈ మహాయాగం పూర్తయింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో జగన్‌కు వేదపండితులు తీర్థప్రసాదాలతో పాటు వేద ఆశీర్వచనాలు అందజేశారు.
Similar News
News December 17, 2025
గుంటూరు జిల్లాలో పోలీసుల స్పెషల్ డ్రైవ్

ఈవ్ టీజింగ్, బైక్ రేసింగ్ అరికట్టేందుకు పోలీస్ శాఖ బుధవారం గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. పలు స్టేషన్ల పరిధిలో ఈవ్ టీజింగ్ కి పాల్పడుతున్న 260 మంది, బైక్ రేసింగ్, ర్యాష్ డ్రైవింగ్‌కి పాల్పడుతున్న 214 మందిని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు వారందరికీ కౌన్సిలింగ్ నిర్వహించి భవిష్యత్తులో ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠినమైన చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
News December 17, 2025
అమరావతి: AGICL ఎండీగా SVR శ్రీనివాస్ బాధ్యతలు

అమరావతి గ్రోత్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్(AGICL) MDగా రిటైర్డ్ IAS అధికారి SVR శ్రీనివాస్ బుధవారం రాయపూడిలోని CRDA కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. AGICL ఎండీగా నియమితులైన SVR శ్రీనివాస్‌కు పలువురు అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. 1989 IAS బ్యాచ్‌కు చెందిన SVR శ్రీనివాస్ మహారాష్ట్ర క్యాడర్‌కు చెందినవారు కాగా..పాలనా సంస్కరణలు, పట్టణాభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు.
News December 17, 2025
క్రికెటర్ శ్రీచరణికి రూ.2.5 కోట్లు.. లోకేశ్ సత్కారం

మహిళా ప్రపంచకప్‌లో సత్తాచాటిన కడప క్రికెటర్ శ్రీచరణికి కూటమి ప్రభుత్వం భారీ నజరానా అందించింది. బుధవారం ఉండవల్లిలో మంత్రి నారా లోకేశ్ ఆమెకు రూ.2.5 కోట్ల చెక్కును స్వయంగా అందజేశారు. నగదుతో పాటు విశాఖలో 500 గజాల ఇంటి స్థలం, డిగ్రీ పూర్తయ్యాక గ్రూప్-1 ఉద్యోగం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీచరణి ప్రతిభ రాష్ట్రానికి గర్వకారణమని మంత్రి కొనియాడారు.


