News September 1, 2025
జగన్‌తో ఉమ్మడి కడప జిల్లా వైసీపీ నేతలు

పులివెందులలో మాజీ సీఎం వైఎస్ జగన్‌ను ఉమ్మడి కడప జిల్లా వైసీపీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. వారిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మేయర్, జడ్పీటీసీలు, పలువురు ప్రముఖులు ఉన్నారు. అందరితో జగన్ చర్చించారు. రాబోయే రోజుల్లో జిల్లాలో చేయాల్సిన కార్యాచరణలపై చర్చించారు.
Similar News
News September 2, 2025
కడప: అంగన్వాడీ సిబ్బందికి వేతనాలు పెంచాలని మంత్రి లోకేశ్‌కు వినతి

అంగన్వాడీ సిబ్బందికి వేతనాలు పెంచి ఆదుకోవాలని అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్, యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీదేవి అన్నారు. మంగళవారం జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి లోకేశ్‌ను అంగన్వాడీలు కలిశారు. అంగన్వాడీ కేంద్రాలకు సన్న బియ్యం ఏర్పాటు చేయాలని, వేతనాలు పెంచాలని కోరారు. ఇoదుకు స్పందించిన మంత్రి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగవ్వగానే వేతనాలు పెంచుతామన్నారు.
News September 2, 2025
చింతకొమ్మదిన్నె: ‘విద్యార్థులతో ముచ్చటించిన మంత్రి లోకేశ్

చింతకొమ్మదిన్నె మండలంలో ఏర్పాటు చేసిన స్మార్ట్ కిచెన్‌ను మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. అనంతరం ఆయన స్థానిక పాఠశాల విద్యార్థులతో ముచ్చటిస్తూ, వారి ఆశయాలు, లక్ష్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యకు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థుల సందేహాలకు సమాధానమిస్తూ, ప్రభుత్వ కార్యక్రమాలు గురించి వివరించారు. విద్యార్థులు మంత్రి మాటలతో ఉత్సాహం పొందారు.
News September 2, 2025
ప్రొద్దుటూరు: వృద్ధాప్యంలో క్షోభకు గురిచేస్తున్న కుమార్తె

వృద్ధాప్యంలో తమను జాగ్రత్తగా చూసుకోవాల్సిన కూతురే క్షోభకు గురుచేస్తోందని ప్రొద్దుటూరు (M) భగత్ సింగ్ కాలనీలోని మస్తానయ్య, దస్తగిరమ్మ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. వారిని చదివించి వివాహాలు చేశారు. 4 నెలల క్రితం పెద్ద కూతురు తమ బాగోగులు చూసుకుంటుందని నమ్మించి ఇంటిని రాయించుకుంది. ఆ తర్వాత తమని పట్టించుకోలేదని, న్యాయం చేయాలని వారు జమ్మలమడుగు RDOను ఆశ్రయించారు.