News December 15, 2024
జగన్‌ను విమర్శించే నైతిక హక్కు అవంతికి లేదు: కృష్ణ

మాజీ సీఎం జగన్‌ను విమర్శించే నైతిక హక్కు అవంతి శ్రీనివాస్‌కు లేదని వైసీపీ రాష్ట్ర నాయకుడు ఆల్ఫా కృష్ణ అన్నారు. శనివారం డాబాగార్డెన్స్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యక్తిగత, స్వార్థ ప్రయోజనాల కోసం అవంతి శ్రీనివాసరావు ఇప్పటికే నాలుగు పార్టీలు మార్చారన్నారు. జగన్ తాడేపల్లిలో కూర్చుని ఆదేశాలు ఇస్తే పాటించాలా అని అవంతి అనడం సమంజసం కాదని, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Similar News
News September 15, 2025
విశాఖ సీపీ కార్యాలయానికి 115 ఫిర్యాదులు

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా పోలీస్ కమీషనరేట్లో సోమవారం 115 ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. ఫిర్యాదుదారులతో నేరుగా ఆయన మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి చట్టపరంగా సమస్య పరిష్కారించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్లో ఒకసారి నమోదైన ఫిర్యాదు పునరావృతం కాకుండా చూడాలన్నారు.
News September 15, 2025
విశాఖ బీచ్ పరిశుభ్రత లోపాలపై కమిషనర్ ఆగ్రహం

విశాఖ వచ్చే పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడమే ధ్యేయమని GVMC కమిషనర్ కేతన్ గార్గ్ స్పష్టం చేశారు. కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలి వరకు ఎక్కడా వ్యర్థాలు కనిపించకూడదని ఆదేశించారు. ఆటుపోట్లు ఎక్కువగా ఉండే పౌర్ణమి, అమావాస్య రోజుల్లో ముందుస్తు ప్రణాళికలు వేసుకోవాలన్నారు. RK బీచ్‌లో అపరిశుభ్ర వాతావరణం ఉండటంతో బీచ్ స్వీపింగ్ యంత్రాలు నిర్వహించే ఏజెన్సీ ఫామ్‌టెక్ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
News September 15, 2025
విశాఖ డాగ్ స్క్వాడ్.. నేర నియంత్రణలో కీలకం

విశాఖ నగర పోలీస్ డాగ్ స్క్వాడ్‌లో 18 శునకాలు నేర నియంత్రణలో పాలుపంచుకుంటున్నాయి. వీటిలో 10 నార్కోటిక్, 6 ఎక్స్‌ప్లోజివ్, 2 ట్రాకర్ డాగ్స్ ఉన్నాయి. ఇటీవల రైల్వే స్టేషన్ పరిధిలో ఈ జాగిలాలు 41 కిలోల గంజాయిని పట్టుకున్నాయి. జిల్లా కలెక్టర్, జీవీఎంసీ సహకారంతో కొత్తగా 8 నార్కోటిక్ శునకాలు, నూతన కెన్నెల్స్ స్క్వాడ్‌లో చేరాయి. వీటికి క్రమం తప్పకుండా వ్యాక్సినేషన్ అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.