News September 24, 2025

జగన్మోహన్ రెడ్డిని కలిసిన విశాఖ జిల్లా వైసీపీ నేతలు

image

మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని విశాఖ జిల్లా వైసీపీ నేతలు బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిశారు. వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొని పలు విషయాలపై చర్చించారు. విశాఖలో వైసీపీ తరఫున చేస్తున్న కార్యక్రమాలను జిల్లా వైసీపీ అధ్యక్షుడు కే.కే.రాజు వివరించారు. ప్రజలకు అండగా నిలవాలని జగన్ మోహన్ రెడ్డి సూచించారు. కే.కే.రాజుతో పాటు తిప్పల దేవన్ రెడ్డి, మొల్లి అప్పారావు ఉన్నారు.

Similar News

News September 25, 2025

విశాఖ సెంట్రల్ జైలును సందర్శించిన మహిళా కమిషన్ ఛైర్‌ పర్సన్

image

రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ బుధవారం విశాఖ సెంట్రల్ జైలును సందర్శించారు. మహిళా బ్యారేక్‌ను పరిశీలించి మహిళా ఖైదీలతో మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ పోషమ్మ పథకం అమలు చేస్తోందని, మహిళా ఖైదీలకు కూడా ఈ పథకం కింద ప్రత్యేక డైట్ ప్లాన్ అమలు చేసేలా పరిశీలిస్తున్నామని వివరించారు.

News September 24, 2025

పేదల గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలి: విశాఖ కలెక్టర్

image

పేదల గృహ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. బుధవారం గృహ నిర్మాణ ప్రగతిపై హౌసింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మార్చి 2026 నాటికి గృహ నిర్మాణ పనులు పూర్తి చేయవలసి ఉన్నందున సంబంధిత అధికారులందరూ పేదల గృహ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మార్చికి పూర్తి చేసుకోకపోతే ఇంటితో పాటు స్థలం పట్టా కూడా రద్దు చేస్తామని లబ్ధిదారులకు తెలియజేయాలన్నారు.

News September 24, 2025

విశాఖలో జోన్ల ఏర్పాటుపై మంత్రి నారాయణ కీలక ప్రకటన

image

ఎమ్మెల్యే గణబాబు ప్రస్తావించిన జోనల్ కమిషనర్ల అధికారాల బదలాయింపుపై మంత్రి నారాయణ స్పందించారు. విశాఖలో జోన్ల ఏర్పాటు పూర్తయిందని, వాటికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు తక్షణమే జారీ చేస్తామన్నారు. సింహాచలం టీడీఆర్ బాండ్ల సమస్యపై దేవదాయ శాఖతో చర్చిస్తున్నామని, త్వరలోనే ఆ సమస్యను కూడా పరిష్కరిస్తామని చెప్పారు.