News October 8, 2025
జగన్ కాన్వాయ్‌లో ఈ షరతులు తప్పనిసరి: పోలీసులు

➤ కాన్వాయ్‌తో ర్యాలీలు, రోడ్ మార్చ్‌లు నిషేధం
➤ Z+ భద్రతా నిబంధనల ప్రకారం ఎస్కార్ట్, పైలట్, బ్యాకప్ వాహనాలతో సహా మొత్తం 10వాహనాలకు మించకూడదు
➤ కాన్వాయ్ వెళ్తున్న సమయంలో ఇతర వాహనాలు చేరకూడదు
➤ కార్యక్రమం ప్రారంభానికి కనీసం 24 గంటల ముందు వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్, డ్రైవర్ పేరు, కాంటాక్ట్ నంబర్ ట్రాఫిక్ ACPకి సమర్పించాలి
ఈ షరతులను ఉల్లంఘించినట్లైతే <<17944917>>అనుమతి<<>> రద్దు చేస్తామని పోలీసులు తెలిపారు.
Similar News
News October 8, 2025
మెదడు సమస్య కాళ్లలో మొదలు: డాక్టర్

‘మెదడు మోకాళ్లలో ఉందా?’ అని అందరం అనే ఉంటాం కదా. కానీ డిమెన్షియా మోకాళ్లలో మొదలవుతుందని న్యూరో సర్జన్ డా. అరుణ్ L నాయక్ తెలిపారు. పలు శారీరక, మానసిక సమస్యలు కలిసిన వ్యాధి డిమెన్షియా అని ఆయన వివరించారు. ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే కాలి కండరాల్లో పటుత్వం పోయి మెదడుకు పంపాల్సిన కొన్ని కెమికల్స్‌ను నరాలు పంప్ చేయలేవు. ఫలితంగా బ్రెయిన్ ఆలోచన శక్తి తగ్గడం, మతిమరుపు తదితరాలు డిమెన్షియాకు దారితీస్తాయట.
News October 8, 2025
పోలీస్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నాణ్యమైన పెట్రోల్, డీజిల్: CP

పోలీస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో కొణిజర్ల పోలీస్ స్టేషన్ ప్రక్కన ఏర్పాటు చేసిన HPCL పెట్రోల్ బంకును బుధవారం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రారంభించారు. పోలీస్ సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ద్వారా నాణ్యమైన పెట్రోల్, డీజిల్ అందించడమే కాకుండా దీనిపై వచ్చే ఆదాయం పోలీసు సిబ్బంది సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
News October 8, 2025
జీవ ఎరువుల వాడకం – తీసుకోవాల్సిన జాగ్రత్తలు

రైతు వాడే <<17939337>>జీవ ఎరువు<<>> ఆ పంటకు సరైనదై ఉండాలి. ఈ ఎరువు ప్యాకెట్లను నీడ ప్రదేశంలోనే నిల్వచేయాలి. ప్యాకెట్‌పై పేర్కొన్న గడువు తేదీలోపే వాడుకోవాలి. రసాయన ఎరువులతో కలిపి జీవ ఎరువులు వాడరాదు. పొలంలో తగినంత తేమ ఉన్నప్పుడే వీటిని వాడుకోవాలి. సేంద్రియ ఎరువుతో జీవ ఎరువు కలిపిన వెంటనే పంటకు వాడుకోవాలి. ఈ ఎరువులను తొలిసారి వినియోగిస్తుంటే వ్యవసాయ అధికారులను సంప్రదించి వారి సూచనల మేరకే వినియోగించాలి.