News March 7, 2025

‘జగన్ చంచలగూడకి ఎక్కువ.. అండమాన్‌కి తక్కువ’ 

image

YCP అధినేత జగన్మోహన్ రెడ్డి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి మాటలు కుళాయిల వద్ద మహిళలు మాట్లాడేలా ఉన్నాయని విమర్శించారు. కార్పొరేటర్‌కు తక్కువ అనడం చూస్తుంటే జగన్ రెడ్డికి మతిభ్రమించినట్లు ఉందని మండిపడ్డారు. జగన్ చంచలగూడకి ఎక్కువ..అండమాన్‌కి తక్కువ అని ఆమె ఎద్దేవా చేశారు.

Similar News

News September 18, 2025

HYD: సైకిళ్లపై తిరుగుతూ.. తామున్నామంటున్న మహిళా పోలీస్

image

నాగోల్ PS పరిధిలో విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. మహిళా పోలీసులు సైకిళ్లపై తిరుగుతూ ప్రజలతో మమేకమయ్యారు. వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వీధుల్లోకెళ్లి తెలుసుకున్నారు. గృహహింస, వేధింపులు, అవాంఛనీయ ప్రవర్తన, మద్యం మత్తులో అల్లర్ల సమస్యలపై అవగాహన కల్పించారు. ఏ ఇబ్బంది వచ్చినా అండగా నిలిచి రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు. డయల్ 100, 112, షీ టీమ్స్ సేవలను ఉపయోగించుకోవాలని స్థానికులకు సూచించారు.

News September 18, 2025

ADB: క్రైస్తవ సంఘాలతో ఛైర్మన్ సమావేశం

image

రాష్ట్ర క్రైస్తవ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ దీపక్ జాన్ ఆదిలాబాద్‌లో బుధవారం పర్యటించారు. కలెక్టర్ రాజర్షిషాతో కలిసి క్రైస్తవ సంఘాలు, పాస్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించి వారి సమస్యలను తెలుసుకున్నారు. క్రైస్తవ శ్మశానవాటికకు భూమి, బీసీ-సీ కుల ధ్రువీకరణ పత్రం, క్రైస్తవ కమ్యూనిటీ హాల్ వంటి వారి సమస్యలను ఆయనకు వివరించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఛైర్మన్ హామీ ఇచ్చారు.

News September 18, 2025

ఈనెల 22 నుంచి ఓపెన్ స్కూల్ సొసైటీ టెన్త్ ఇంటర్ పరీక్షలు

image

జిల్లాలో టాస్క్ ఓపెన్ స్కూల్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే టెన్త్, ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ రెవిన్యూ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్‌లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి, TG ఓపెన్ స్కూలింగ్ సొసైటీ (TOSS) SSC & ఇంటర్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. పరీక్షలు సెప్టెంబర్ 22 నుంచి 28 వరకు రెండు సెషన్లలో ఉంటాయన్నారు.