News June 18, 2024
జగన్ నిజంగా మనిషేనా: ఆమదాలవలస MLA కూన
ప్రజల గాలి తన వైపు లేదని తెలుసుకొని, ఇంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ మాట్లాడుతున్న మాజీ సీఎం జగన్ అసలు మనిషేనా అని ఆమదాలవలస MLA కూన రవికుమార్ ట్వీట్ చేశారు. తాను ఓడిపోతే ప్రజలు ఓటెయ్యలేదని మాట ఒప్పుకోకుండా, ఈవీఎంల మీద జగన్ నెపాన్ని నెట్టేస్తున్నారని రవి విమర్శించారు. ఈవీఎంలను సమర్థిస్తూ గతంలో జగన్ మాట్లాడిన వ్యాఖ్యలను MLA రవి ఈ మేరకు Xలో పోస్ట్ చేసి జగన్ ట్వీట్‌కు కౌంటరిచ్చారు.
Similar News
News November 27, 2024
శ్రీకాకుళం: ‘P.G సెమిస్టర్ పరీక్షలు రీ షెడ్యూల్’
శ్రీకాకుళం డా.బి.ఆర్.ఏ.యూ.లోని PG ఆర్ట్స్ & సైన్స్ కోర్సులకు సంబంధించి 3వ సెమిస్టర్ పరీక్షలు రీ షెడ్యూల్ చేశారు. తొలుత పరీక్షలు డిసెంబర్ 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని ప్రకటించగా మళ్లీ డిసెంబర్ 16వ తేదీకి మార్పులు చేశారు. విద్యార్థుల కోరిక మేరకు పరీక్షల తేదీని రీ షెడ్యూల్ చేసినట్లు యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఎస్. ఉదయ్ భాస్కర్ తెలిపారు. విద్యార్థులు ఈ విషయం గమనించాలన్నారు.
News November 27, 2024
శ్రీకాకుళం జిల్లాలో డాగ్ స్క్వాడ్ తనిఖీలు
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డాగ్ స్క్వాడ్‌తో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో గంజాయి నిర్మూలనలో భాగంగా టెక్కలి, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, ఇతర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ప్రధాన కూడళ్లలో వాహనాలను అపి క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. గంజాయి రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.
News November 27, 2024
కర్మవీర చక్ర అవార్డు అందుకున్న శ్రీకాకుళం వాసి
సంతబొమ్మాలి మండలం రుంకు హనుమంతుపురం గ్రామానికి చెందిన పోలాకి జయరామ్ కర్మవీర చక్ర అవార్డును అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాలలో లక్షాలది మంది విద్యార్థుల జీవితాల్లో జీవన ప్రమాణాలు అభివృద్ధి కోసం కృషి చేశారు. ఇందుకోసం కర్మవీర చక్ర అవార్డును ఢిల్లీలో నవంబర్ 26న హార్ట్ ఫర్ ఇండియా ఫౌండేషన్ ఫౌండర్, ప్రెసిడెంట్ ప్రిన్సెస్ ప్రాన్క్రోసి స్టూడిజా చేతులు మీదుగా ప్రధానం చేశారు.