News November 4, 2025
జగన్ పర్యటనకు వింత షరతులు: వైసీపీ ఫైర్

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృష్ణాజిల్లా పర్యటనకు పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు గాను జగన్ నేడు జిల్లాలోని గూడూరు, మచిలీపట్నం రానున్నారు. అయితే జగన్ పర్యటనలో 500 మంది, 10 కాన్వాయ్‌లకే పోలీసులు అనుమతి ఇచ్చారు. బైక్‌లకు అనుమతి ఇవ్వలేదు. దీనిపై YCP ట్వీట్ చేసింది. జగన్ పర్యటనకు వేలాది మంది వస్తారని తెలిసినా ఈ వింత షరతులు ఏంటని మండిపడింది.
Similar News
News November 4, 2025
యువజన ఉత్సవాలు ప్రారంభించిన కలెక్టర్

జనగామ జిల్లా యువజన ఉత్సవాలను మంగళవారం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జూబ్లీ ఫంక్షన్ హాల్‌లో ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. యువత సాంస్కృతిక కళారంగాల్లోని అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలని కోరారు. దీనివల్ల భవిష్యత్తులో ఉద్యోగ, సాఫ్ట్‌వేర్ రంగాల్లో ప్రాధాన్యం ఉంటుందని వివరించారు.
News November 4, 2025
గర్భనిరోధక మాత్రలతో స్ట్రోక్ ముప్పు

అవాంఛిత గర్భాన్ని నిరోధించేందుకు చాలామంది మహిళలు గర్భనిరోధక మాత్రలు వాడుతుంటారు. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు ఉన్న గర్భనిరోధక మాత్రలు వాడే మహిళలకు క్రిప్టోజెనిక్ స్ట్రోక్ ముప్పు ఎక్కువని పరిశోధకులు గుర్తించారు. మెదడుకు రక్తసరఫరా జరిగే మార్గంలో రక్తం గడ్డకట్టి ఈ స్ట్రోక్ వస్తుంది. మహిళలకు వస్తున్న స్ట్రోక్‌లలో దాదాపు 40% దాకా క్రిప్టోజెనిక్ ఐషెమిక్ స్ట్రోక్‌లేనని తెలిపారు.
News November 4, 2025
ఫైనల్‌కు ముందు కౌర్ బామ్మకు హార్ట్ఎటాక్.. విషయం దాచి!

ఉమెన్స్ WC ఫైనల్‌కు ముందు IND ప్లేయర్ అమన్‌జోత్ కౌర్ మానసిక స్థైర్యం దెబ్బతినకుండా ఆమె కుటుంబం కఠిన నిర్ణయం తీసుకుంది. బామ్మకు హార్ట్ఎటాక్ వచ్చిన విషయాన్ని మ్యాచ్ ముగిసేవరకు కౌర్‌కు తెలియకుండా దాచింది. విజయం తర్వాత విషయం తెలుసుకుని ఆమె బాధతో కుంగిపోయారు. కాన్సంట్రేషన్ దెబ్బతినొద్దని ఆమెకు ఈ విషయాన్ని చెప్పలేదని కుటుంబం తెలిపింది. కూతురి కోసం గుండెనిబ్బరం చూపిన కుటుంబంపై ప్రశంసలొస్తున్నాయి.


