News July 10, 2025
జగన్ పర్యటనపై మూడు కేసుల నమోదు

జగన్ బంగారపాళ్యం పర్యటనలో మూడు పోలీసు కేసులు నమోదయ్యాయి. నిబంధనలు ఉల్లంఘించి రోడ్డు షో చేశారంటూ పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్, నాయకులు కుమార్ రాజా, పాలేరు రామచంద్రారెడ్డిపై కేసు పెట్టారు. రోడ్డుపై మామిడి కాయలు పోసిన డ్రైవర్లపై మరో కేసు నమోదు కాగా ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌పై దాడి చేసినట్లు మరోకేసు పెట్టారు.
Similar News
News July 10, 2025
రైతులు మీకు దొంగలు, రౌడీలుగా కనిపిస్తున్నారా?: జగన్

AP: మామిడి రైతులు సీఎం చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా కళ్లకు దొంగలు, రౌడీల్లాగా కనిపిస్తున్నారా? అని మాజీ CM జగన్ మండిపడ్డారు. రైతులకు అండగా నిలవకపోగా వారిపై వెకిలి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బాబు పాలకుడు అని చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలి. 76 వేల రైతు కుటుంబాల సమస్యను గాలికొదిలేశారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకుని రైతులకు అండగా నిలబడండి’ అంటూ ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
News July 10, 2025
విద్యార్థులతో నంద్యాల కలెక్టర్

వెలుగోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 2.0 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘మెగా పీటీఎం’లోగోతో రూపొందించిన ఫొటో ఫ్రేమ్ వద్ద విద్యార్థులతో కలిసి కలెక్టర్ ఫొటోలు దిగారు. బాగా చదువుకుని ఉన్నతంగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు.
News July 10, 2025
ప్రేమ పెళ్లి.. వరుడికి 79, వధువుకు 75 ఏళ్లు

ప్రేమకు వయసుతో సంబంధం లేదని కేరళకు చెందిన ఓ వృద్ధ జంట నిరూపించింది. రామవర్మపురంలోని ప్రభుత్వ వృద్ధాశ్రమంలో 79 ఏళ్ల విజయ రాఘవన్, 75 ఏళ్ల సులోచన మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తాజాగా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద ఒక్కటయ్యారు. వీరి వివాహానికి ఆ రాష్ట్ర మంత్రి ఆర్.బిందు, సిటీ మేయర్ వర్గీస్, అధికారులు హాజరయ్యారు.