News October 24, 2024

జగన్ పర్యటన బందోబస్త్‌పై హోంమంత్రి రియాక్షన్

image

YS.జగన్ గుర్ల పర్యటనలో బందోబస్త్‌ విషయమై అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. ఇప్పుడు నొప్పి తెలుస్తోందా.. రామతీర్థాలకు వచ్చిన చంద్రబాబు రోడ్డు మీద కూర్చున్నప్పుడు ఆ నొప్పి తెలీలేదా జగన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా తాము ప్రొటోకాల్ ఇస్తున్నాం.. నువ్వొస్తున్నావని పరదాలు కట్టేసి, చెట్లు కొట్టేయాలా ఇప్పుడు ఒక MLAవి దానికి తగ్గ సెక్యురిటీనే ఉంటుంది అన్నారు.

Similar News

News February 16, 2026

లోకల్ హాలిడే ఉన్నా పరీక్ష తప్పనిసరి: డీఈవో

image

విజయనగరం జిల్లాలోని అన్ని ఉప విద్యాశాఖాధికారులు, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులకు డీఈవో మాణిక్యాలనాయుడు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం జరిగే 10వ తరగతి ప్రీఫైనల్ బయాలజీ పరీక్షను యథావిధిగా నిర్వహించాలని తెలిపారు. లోకల్ హాలిడే ఉన్నా పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. ఇది ఇలా ఉండగా మిగతా క్లాసులకు కొన్ని స్కూళ్లు సెలవు ప్రకటించాయి. మరి మీ స్కూల్‌కు సెలవు ఇచ్చారా..

News February 15, 2026

VZM: సుమారు 1000 మందితో భద్రత ఏర్పాట్లు

image

మహాశివరాత్రి సందర్భంగా జిల్లాలోని ప్రముఖ శివాలయాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు SP దామోదర్ శనివారం తెలిపారు. రామతీర్థం, పుణ్యగిరి, సంగం దేవాలయాలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో సుమారు 1000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు వెల్లడించారు. బందోబస్తులో నలుగురు డీఎస్పీలు, 16 మంది సీఐలు, 55 మంది ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, 160 మంది ఎఎస్ఐలు, హెచ్సీలు విధులు నిర్వర్తిస్తారన్నారు.