News June 20, 2024
జగన్ పాలనలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తం: MLC

జగన్ పాలనలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ అన్నారు. పార్వతీపురంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం జీవో 117 తీసుకువచ్చి పాఠశాలలను నాశనం చేసిందన్నారు. కొత్త ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయని, ఉపాధ్యాయులు ఫ్రెండ్లీగా ఉండాలని ఆకాక్షించారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం 117 జీవోను రద్దు చేస్తేనే విద్యావ్యవస్థ మెరుగుపడుతుందన్నారు.
Similar News
News February 10, 2026
VZM: ‘ప్రాజెక్టులకు భూసేకరణ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలి’

జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు చేపట్టిన భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల భూసేకరణకు సంబంధించి కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. తారకరామ తీర్ధసాగర్, తోటపల్లి ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, తదితర ప్రాజెక్టులపై చర్చించారు.
News February 10, 2026
విజయనగరం జిల్లాలో 33 వేల ఎకరాల్లో మామిడి సాగు

విజయనగరం జిల్లాలో మామిడి పంట 33 వేల ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారని జిల్లా ఉద్యానవన శాఖాధికారి కే.చిట్టిబాబు తెలిపారు. వాతావరణం సానుకూలంగా ఉండడంతో మంచి ఫలితాలు వచ్చాయాన్నారు. మామిడికి వచ్చే తెగులు కూడా తక్కువుగా ఉండడంతో రైతులు తగు జాగ్రత్తలు తీసుకుంటే ఆశించిన విధంగా దిగుబడి ఉంటుందన్నారు. పొగమంచు పడడంతో మామిడి పూత రాలిపోకుండా పూత రాలిన చోట మందులు పిచికారి చేయాలని సూచించారు.
News February 10, 2026
VZM: ‘సాంకేతికతను ఉపయోగిస్తూ అప్రమత్తంగా ఉండాలి’

ప్రతి ఒక్కరూ ఆధునిక పరికరాలను ఇంటర్‌నెట్ అనుసంధానంతో విరివిగా ఉపయోగిస్తున్నారని, దీంతో సైబర్ మోసాలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముందని జిల్లా రెవెన్యూ అధికారి మురళి అన్నారు. విజయనగరం కలెక్టరేట్‌లో NIC ఆధ్వర్యంలో సురక్షిత అంతర్జాల దినోత్సవం మంగళవారం జరిగింది. ఆన్‌లైన్ మోసాలకు గురికాకుండా ఉండాలంటే మొబైల్ ఫోన్లు, డెస్క్ టాప్, ల్యాప్‌టాప్‌లకు 2 అంచల భద్రత ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు.


