News March 5, 2025
జగన్ ప్రజా సమస్యలపై మాట్లాడాలి: గొట్టిపాటి

చిత్తశుద్ధి ఉంటే జగన్ అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. నాడు టీడీపీకి 23 సీట్లు వచ్చాయని మేము ముసుగు వేసుకుని దాక్కోలేదన్నారు. ధైర్యంగా అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పోరాటం చేశామన్నారు. ప్రజా సమస్యలపై పోరాడినందుకే కూటమికి అఖండ మెజారిటీ వచ్చిందని పేర్కొన్నారు.
Similar News
News November 13, 2025
తెలంగాణ ముచ్చట్లు

* ఉన్నతాధికారులు పర్మిషన్ లేకుండా స్కూల్ నుంచి విద్యార్థులను బయటకు తీసుకెళ్లొద్దని హెడ్మాస్టర్లకు ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆదేశాలు
* ఫిరాయింపు MLAలను రేపు, ఎల్లుండి అసెంబ్లీలోని కార్యాలయంలో విచారించనున్న స్పీకర్ గడ్డం ప్రసాద్
* ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు 34,023 మందికి స్వచ్ఛ భారత్ మిషన్ కింద మరుగు దొడ్లు మంజూరు
* ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో టాప్-3లో జనగాం, ఖమ్మం, యాదాద్రి.. నిర్మాణ పనుల్లో 70% పురోగతి
News November 13, 2025
భారత్ సమ్మిట్.. ఆకర్షణీయంగా భద్రాద్రి ఉత్పత్తులు

HYD శిల్పకళా వేదికలో జరుగుతున్న భారత్ సమ్మిట్‌లో భద్రాద్రి జిల్లా ఉత్పత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. జిల్లా మహిళా సమైక్య ఆధ్వర్యంలో గిరిజన, SHG మహిళలు, MSME యూనిట్లు తయారు చేసిన అటవీ ఉత్పత్తులు, పిండివంటలు, హస్తకళా వస్తువులకు విశేష ఆదరణ లభించింది. ముఖ్యంగా ఇప్పపువ్వు లడ్డూ, బర్ఫీ, టీ పొడి, పొంగర్ పచ్చళ్లు, కరక్కాయ పొడి ఆకర్షణగా నిలిచాయి.
News November 13, 2025
పదునెట్టాంబడి అంటే ఏంటి?

పదునెట్టాంబడి అంటే అయ్యప్ప స్వామి ఆలయంలో ఉండే 18 మెట్లు. ఈ మెట్లు మనిషి పరిపూర్ణత సాధించిన జ్ఞానానికి సంకేతాలు. జ్ఞాన సాధన చేసే అయ్యప్ప స్వాములు మాత్రమే వీటిని ఎక్కుతారు. వారికి ప్రత్యేకంగా పడిపూజ చేస్తారు. ఈ మెట్లు ఎక్కడం అనేది జ్ఞాన మార్గంలో సాగే ఆధ్యాత్మిక ప్రయాణానికి గుర్తుగా భావిస్తారు. ప్రతి మెట్టూ అజ్ఞానాన్ని, అహంకారాన్ని తొలగిస్తుంది. పరిశుద్ధమైన మనసుతోనే ఈ మెట్లెక్కాలి. <<-se>>#AyyappaMala<<>>


