News July 2, 2024
జగన్ ఫొటోపై ఉదయగిరి MLA ఆగ్రహం

ఓ ప్రభుత్వ భవనంపై మాజీ CM జగన్ ఫొటో ఇంకా ఉంచడంపై టీడీపీ MLA ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ విజమూరు మండలం గుండెమడకల గ్రామంలో పింఛన్ల పంపిణీకి వెళ్లారు. స్థానికంగా ఉన్న హెల్త్ కేర్ సెంటర్ భవనం వద్ద జగన్ ఫొటో కనపడింది. దీంతో ఆయన మెడికల్ ఆఫీసర్‌కు కాల్ చేశారు. ‘ఏంటి సార్ ఇంకా ప్రభుత్వం మారలేదా? మీకు తెలియదా?’ అని అసహనం వ్యక్తం చేశారు.
Similar News
News September 18, 2025
నెల్లూరు: రేషన్ బియ్యం అక్రమ రవాణా ఆగేదెప్పుడు?

నెల్లూరులో రేషన్ బియ్యం మాఫియా ఆగడం లేదు. ప్రభుత్వ హెచ్చరికలు, కేసులు ఉన్నా అక్రమార్కులు కోట్ల విలువైన బియ్యం నల్లబజారుకు మళ్లిస్తున్నారు. నెల్లూరు, ఆత్మకూరు ప్రాంతాలకు చెందిన వ్యాపారులు మిల్లుల్లోనే బియ్యం రీసైకిల్ చేసి సీఎంఆర్ కింద ప్రభుత్వానికే తిరిగి పంపుతున్నారు. జిల్లాలో నెలకు సరఫరా చేసే 11 వేల టన్నుల్లో సుమారు 8 వేల టన్నులు పక్కదారి పడుతున్నాయని సమాచారం.
News September 18, 2025
ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు ఇస్తాం: మంత్రి ఆనం

సంగం మండలం పెరమన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. రూ.5 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వడానికి సీఎం చంద్రబాబు అంగీకారం తెలిపారన్నారు. తక్షణం ఆర్థిక సహాయం ప్రకటించిన సీఎంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
News September 18, 2025
నెల్లూరు: గుర్తుతెలియని వ్యక్తి మృతి

గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన నెల్లూరు-వేదాయపాలెం రైల్వే స్టేషన్ మధ్య బుధవారం జరిగింది. విజయవాడ-చెన్నై మార్గంలో రైలు పట్టాలపై డెడ్ బాడీ దొరికింది. డోర్ వద్ద కూర్చొని రైలు నుంచి జారిపడి మృతిచెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి వయస్సు 30 నుంచి 35 ఏళ్లు ఉంటుంది. మెరూన్ రంగు ఆఫ్ టీషర్ట్, బ్లూ రంగు షార్ట్ ధరించాడు. ఎస్సై హరి చందన కేసు నమోదు చేశారు.