News December 26, 2025

జగన్ బెదిరింపులకు భయపడే వారు లేరు: మంత్రి సవిత

image

పీపీపీ మోడల్‌లో మెడికల్ కళాశాలల నిర్మాణానికి వచ్చే కాంట్రాక్టర్లను జైలుకు పంపిస్తామని వైసీపీ బెదిరించడంపై మంత్రి సవిత మండిపడ్డారు. శుక్రవారం పెనుకొండలో ఆమె మాట్లాడుతూ.. దౌర్జన్యాలతో అభివృద్ధిని అడ్డుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. జగన్ బెదిరింపులకు భయపడే వారు ఎవరూ లేరని, రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

Similar News

News December 26, 2025

AI డిమాండ్‌కు AP సిద్ధంగా ఉంది: లోకేశ్

image

భారత ఉద్యోగులు AI టూల్స్‌ను అడాప్ట్ చేసుకోవడంలో అన్ని దేశాలను దాటేశారన్న వార్తపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ‘AI అడాప్షన్‌లో భారత్ దూసుకుపోవడం యాదృచ్ఛికం కాదు. గవర్నెన్స్, ఫిన్‌టెక్, హెల్త్, మొబిలిటీ వంటి అంశాల్లో వినియోగ స్థాయిని ఇది ప్రతిబింబిస్తోంది. ఈ డిమాండ్ AI హబ్స్, డేటా సెంటర్స్ ఏర్పాటుకు తోడ్పడనుంది. AI రెడీ DC ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, పవర్, ల్యాండ్‌తో AP సిద్ధం’ అని ట్వీట్ చేశారు.

News December 26, 2025

తిరుపతి: 104లో ఉద్యోగాలు

image

తిరుపతి జిల్లాలో 104 వాహనాల్లో డ్రైవర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ల ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. డ్రైవర్‌కు 10వ తరగతి, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు డిగ్రీ, కంప్యూటర్ పరిజ్ఞానం- 25WPM, అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. తిరుపతి రుయా ఆసుపత్రిలోని డీఎల్వో ఆఫీసులో ఈనెల 27, 28వ తేదీల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ, డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది.

News December 26, 2025

రామచంద్రపురంలో విజిలెన్స్ కమిటీ సమీక్ష.. ఎస్సీ, ఎస్టీ కేసులపై ఆరా!

image

రామచంద్రపురంలో శుక్రవారం సబ్ డివిజనల్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఆర్డీఓ అఖిల, డీఎస్పీ రఘువీర్ అధికారులతో కలిసి ఎస్సీ, ఎస్టీ కేసులు, వసతి గృహాల నిర్వహణ, ట్రాఫిక్ సమస్యలపై సమీక్షించారు. బాధితులకు న్యాయం చేయడంలో జాప్యం వహించరాదని, సమస్యల పరిష్కారానికి పక్కా ప్రణాళికలతో ముందుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పట్ల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.