News March 13, 2025
జగన్ మానసిక పరిస్థితి సరిగా లేదేమో..?: స్వామి

జగన్ పెట్టిన బకాయిలకు ఆయనే ధర్నాలకు పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందని మంత్రి స్వామి విమర్శించారు. ‘ఫీజు రీయింబర్స్‌మెంట్ రూ.4,271 కోట్ల బకాయి పెట్టింది జగన్ కాదా? ఆయన మానసిక పరిస్థితి సరిగా లేదని చెప్పడానికి.. ఇలా ధర్నాకు పిలుపు ఇవ్వడమే నిదర్శనం. వైసీపీ హయాంలో ప్రతిపక్షాలకు నిరసన తెలిపే హక్కు కూడా లేదు. మేము ప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తుండటంతో ధర్నాలు చేసుకుంటున్నారు’ అని మంత్రి అన్నారు.
Similar News
News March 14, 2025
ఒంగోలు: ఇళ్లు నిర్మించుకునే వారికి గుడ్ న్యూస్

రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారుల ఇంటి నిర్మాణానికి ఆర్ధిక తోడ్పాటు కల్పిస్తూ అదనపు సాయంగా రూ.50 వేల నుంచి లక్ష రూపాయలు మంజూరు చేస్తుంది. క్షేత్ర స్థాయిలో గృహ నిర్మాణ లబ్దిదారులకు అవగాహన కల్పిస్తూ త్వరగా ఇల్లు నిర్మించుకునేలా దృష్టి సారించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. గురువారం సంబంధిత శాఖల జిల్లా అధికారులతో కలసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
News March 14, 2025
సంతోషకర వాతావరణంలో హోలీ జరుపుకోవాలి: ఎస్పీ

మతసామరస్యం పాటిస్తూ సంతోషకర వాతావరణంలో హోలీ పండుగ జరుపుకోవాలని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. ఎదుటివారి మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించవద్దని, ఇబ్బంది కలిగించవద్దని తెలిపారు. సంప్రదాయ పండుగలు ఏవైనా ప్రజలు కలిసిమెలిసి ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, ఇలాంటి పండుగల సమయంలో యువత ఆదర్శంగా మెలగాలని సూచించారు.
News March 14, 2025
ఒంగోలులో రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

ఒంగోలులో రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది.
బీహార్ రాష్ట్రం ఔరంగాబాద్‌కు చెందిన సంజీవ కుమార్ ఒంగోలు రైల్వే స్టేషన్‌కు అతి సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
విషయం తెలుసుకున్న GRPS పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.