News February 16, 2025

జగన్ 2.O పాలనలో అందరి లెక్కలు తేలుస్తా: కాకాణి

image

జగన్ 2.O ప్రభుత్వం రాగానే అతిగా ప్రవర్తించే వారందరి లెక్కలు తేల్చుతామని మాజీ మంత్రి కాకాణి హెచ్చరించారు. పొదలకూరు(M) బిరుదవోలులో శనివారం ఆయన పర్యటించారు. కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో జగన్ తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నాయకులు ధైర్యంగా ఉండాలని, పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని కాకాణి హామీ ఇచ్చారు.

Similar News

News November 6, 2025

నెల్లూరు జిల్లా విభజన ఇలా..!

image

మరోసారి నెల్లూరు జిల్లా విభజన జరగనుంది. కందుకూరును తిరిగి ప్రకాశం జిల్లాలో కలపనున్నారు. తిరుపతి జిల్లాలోని గూడూరు నెల్లూరులోకి రానుంది. విడవలూరు, కొడవలూరును కావలి నుంచి నెల్లూరు డివిజన్‌లోకి మార్చనున్నారు. కలువాయి, రాపూరు, సైదాపురం గూడూరు డివిజన్‌లోకి, వరికుంటపాడు, కొండాపురం జలదంకి, కలిగిరి, దుత్తలూరు, వింజమూరు, సీతారామపురం, ఉదయగిరిని కావలి డివిజన్‌లోకి మార్చేలా ప్రతిపాదనలు చేశారు.

News November 5, 2025

నెల్లూరు: రేపే నారా లోకేశ్ రాక

image

నెల్లూరు జిల్లాలో నారా లోకేశ్ పర్యటన ఖారారైంది. ఆయన గురువారం దగదర్తికి రానున్నారు. దివంగత ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించనున్నారు. సంబంధిత ఏర్పాట్లను ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, కావలి డీఎస్పీ శ్రీధర్ బుధవారం పరిశీలించారు.

News November 5, 2025

NLR: జనసేనలో విబేధాలపై రహస్య విచారణ

image

నెల్లూరు జనసేనలో నెలకొన్న అంతర్గత విభేదాలపై రాష్ట్ర నాయకత్వం దృష్టి పెట్టింది. టిడ్కో ఛైర్మన్ అజయ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఓ వర్గం పవన్ కళ్యాణ్‌కు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాకు MSME ఛైర్మన్ శివ శంకర్ వచ్చారు. రెండు రోజుల పాటు నేతలతో విడివిడిగా మాట్లాడారు. నివేదికను జనసేనానికి అందివ్వనున్నారు. జనసేనాని జోక్యంతో నేతల్లో ఉన్న అసంతృప్తి జ్వాల చల్లారుతుందో లేదో చూడాలి.