News April 9, 2025

జగిత్యాలకు ఆ పేరు ఎలా వచ్చిందంటే

image

జగిత్యాలకు ఈ పేరు రావడానికి పలు రకాల కథనాలు వ్యాప్తిలో ఉన్నాయి. క్రీ.శ. 1110 నుంచి 1116 వరకు పొలాస రాజధానిగా జగ్గ దేవుడు పరిపాలించాడు. తన పరిపాలనా కాలంలో 21 యుద్ధాలు చేసి పరిసర ప్రాంతాల్లో పలు నూతన గ్రామాలను స్థాపించాడు. పొలాస దక్షిణాన 6 కి.మీ. దూరంలో జయదేవుడు అతని పేరిట జగ్గ దేవాలయం నిర్మించి ఉంటాడని, అదే జగిత్యాల స్థిరపడిందని చరిత్రకారుల కథనం. 2016లో జగిత్యాల ప్రత్యేక జిల్లాగా ఏర్పడింది.

Similar News

News November 10, 2025

VKB: కళ్లముందే కదలాడుతున్నాయి

image

చేవెళ్ల బస్సు ప్రమాదం జరిగి నేటికి వారమవుతున్నా ప్రజల మనసుల్లో ఇంకా ఆ దృశ్యాలు కదలాడుతూనే ఉన్నాయి. అయితే ఓ ప్రశ్న మాత్రం ఇంకా అందరి నోటా వినిపిస్తోంది. ఈ ప్రమాదానికి బాధ్యులు ఎవరు..? రోడ్డును బాగు చేయక వదిలేసిన రాజకీయ నాయకులా..? రోడ్డు విస్తరణకు అడ్డుగా నిలిచిన పర్యావరణ ప్రేమికులా..? రీజన్ ఏదైనా రహదారి విస్తరణ జరిగుంటే ఇలా అయ్యేది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

News November 10, 2025

అంచనాలు పెంచేసిన ‘ఉస్తాద్’ టీమ్

image

పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ఉస్తాద్ భగత్‌సింగ్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మీసాల పిల్ల(మన శంకర వరప్రసాద్ గారు), చికిరి(పెద్ది) పాటలు హిట్టవడంతో ఇక ‘ఉస్తాద్’ అప్డేటే మిగిలిందని అభిమానులు SMలో పోస్టులు చేస్తున్నారు. దీంతో మూవీ టీమ్ స్పందించింది. ‘అదే పనిలో ఉన్నాం. మీ అంచనాలను ఎక్కువగానే పెట్టుకోండి’ అని రాసుకొచ్చింది. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

News November 10, 2025

14, 15 తేదీల్లో రైతు సంఘం జిల్లా మహాసభలు

image

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ జిల్లా మహాసభలు ఈ నెల 14, 15 తేదీల్లో పశ్చిమగోదావరి జిల్లా, పాలకోడేరు మండలం మోగల్లు గ్రామంలో జరగనున్నాయి. ఈ మహాసభకు రైతు సంఘం జిల్లా క్యాడర్ అంతా పాల్గొని జయప్రదం చేయాలని నాయకులు ఆదివారం పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వి. కృష్ణయ్య, కె. ప్రభాకర్ రెడ్డితో పాటు రాష్ట్ర ఆక్వా సంఘం నాయకులు బి. బలరాం తదితరులు పాల్గొంటారని వారు తెలిపారు.