News January 20, 2026
జగిత్యాలకు మహర్దశ.. నేడే శంకుస్థాపన

జగిత్యాల జిల్లా కేంద్రంలో రూ.235 కోట్లతో నిర్మించనున్న 450 పడకల నూతన ఆసుపత్రికి నేడు భూమిపూజ జరగనుంది. ఈ కార్యక్రమానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరవుతారని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపారు. మాతా శిశు, మెడికల్ కాలేజీ సమీపంలో సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. జిల్లా ప్రజలకు వైద్య సదుపాయాలు మరింత విస్తరిస్తాయని పేర్కొన్నారు.
Similar News
News February 21, 2026
రేపు దేవాదులకు సీఎం రేవంత్ రెడ్డి

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు, తుపాకులగూడెం సమ్మక్క- సాగర్ బ్యారేజ్‌ను ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు. ప్రాజెక్టుల పురోగతి, నీటి నిల్వలు, సాగునీటి పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. సీఎం పర్యటనకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు భారీగా హాజరుకానున్నారు.
News February 21, 2026
తిరుపతి: ALERT.. రేపే లాస్ట్.!

SVU పరిధిలో (UG) డిగ్రీ మొదటి, రెండో, మూడో సంవత్సర ఇయర్ ప్యాటర్న్ పరీక్షలు ఈనెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్ల జారీ కొనసాగుతోందని పరీక్షల విభాగ నియంత్రణ అధికారి రాజమాణిక్యం పేర్కొన్నారు. 22వ తేదీ (ఆదివారం) సాయంత్రం 5 వరకు అభ్యర్థులు హాల్ టికెట్లు పొందవచ్చని ఆయన సూచించారు.
News February 21, 2026
విద్యార్థుల కోసం స్టూడెంట్ వెల్నెస్ ప్రోగాం: కలెక్టర్

హన్మకొండలో బాలల కోసం ప్రత్యేకంగా స్టూడెంట్ వెల్నెస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు వివరించారు. శనివారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ.. స్టూడెంట్ వెల్నెస్ ద్వారా వారి మానసిక వికాస స్థాయిలను గుర్తించి, అవసరమైన వారికి ఆత్మస్థైర్యాన్ని కల్పించే వీలు కలుగుతోందన్నారు. బాలల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపడుతునట్లు చెప్పారు.


