News February 3, 2025
జగిత్యాలలో కిడ్నాప్ కలకలం
జగిత్యాల చింతకుంట వాడలో పట్టపగలు కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. ఇంటి బయట ఆడుకుంటున్న పాపను ఓ జంట ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించగా స్థానికులు వారికి దేహశుద్ధి చేశారు. ఇంటి ముందు ఆడుకుంటున్న పాపకు చాక్లెట్ ఆశచూపి ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. పాప వాళ్లను చూసి ఇంట్లోకి వెళ్లి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో తల్లిదండ్రులతో పాటు ఇరుగుపొరుగు వారు వారిని పట్టుకన్నారని స్థానికులు పేర్కొన్నారు.
Similar News
News February 3, 2025
NZB: వ్యభిచార గృహంపై దాడి
నిజామాబాద్ నగరంలో వ్యభిచార గృహంపై టాస్క్ ఫోర్స్, సీసీఎస్ పోలీసులు సోమవారం దాడి చేసినట్లు తెలిపారు. NZB రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మారుతి నగర్‌లోని ఓ ఇంటిపై పోలీసులు రైడ్ చేశారు. ఈ దాడిలో నిర్వాహకురాలితో పాటు ముగ్గురు బాధిత మహిళలను, ఒక విటుడిని పట్టుకున్నట్లు పోలీసులు వివరించారు. 4 సెల్ ఫోన్లు, రూ.3660 నగదును స్వాధీనం చేసుకుని వారిని రూరల్ పోలీసులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.
News February 3, 2025
‘తీన్మార్ మల్లన్న ఏ పార్టీ?’
TG: కాంగ్రెస్ MLC నవీన్ కుమార్(తీన్మార్ మల్లన్న) ఇటీవల చేసిన వ్యాఖ్యలు జనాల్లో గందరగోళానికి తెరలేపాయి. ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. దీనిపై పార్టీ ఇప్పటికీ స్పందించకపోవడం ఏంటని జనాలు చర్చించుకుంటున్నారు. అధికారపార్టీ నేతగా ఉండి సొంత పార్టీపైనే విమర్శలు చేయడం ఏంటని విస్తు పోతున్నారు. దీంతో ఆయన ఏ పార్టీ నేత అని పలువురు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
News February 3, 2025
రాహుల్ వ్యాఖ్యలు అవాస్తవం: జయశంకర్
లోక్‌సభలో రాహుల్ చేసిన వ్యాఖ్యలు దేశ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని విదేశాంగమంత్రి జయశంకర్ ఫైరయ్యారు. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ప్రధానిని ఆహ్వానించామని కోరడానికి తాను అమెరికాకు వెళ్లాననడం పూర్తిగా అబద్ధం అన్నారు. విదేశాంగ కార్యదర్శిని కలవటానికే అక్కడికి వెళ్లానని స్పష్టం చేశారు. ఎంతో ప్రతిష్ఠ కలిగిన మోదీ లాంటి నాయకుడిపై ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేయటం సరికాదని తన X ఖాతాలో పోస్ట్ చేశారు.