News January 14, 2026
జగిత్యాలలో జర్నలిస్టుల ధర్నా

HYDలో జర్నలిస్ట్‌ల అక్రమ అరెస్టులను నిరసిస్తూ జగిత్యాలలో TUWJ (IJU) ఆధ్వర్యంలో బుధవారం జర్నలిస్ట్‌లు నిరసనకు దిగారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా NTV INPUT ఎడిటర్ దొంతు రమేష్, రిపోర్టర్లు చారి, సుధీర్‌ల అక్రమ అరెస్ట్‌ను ఖండించారు. జర్నలిస్టుల పట్ల ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Similar News
News February 6, 2026
సంగారెడ్డి: వారికి ఒక్కచోటే ఎక్స్ అఫీషియో ఓటు

ప్రజా ప్రతినిధులకు మున్సిపాలిటీలో కౌన్సిలర్లకు సమానంగా ఛైర్మన్ ఎన్నిక సమయంలో ఓటు వేసే అధికారం ఉంటుంది. పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి 5 మున్సిపాలిటీలో ఒక్కచోట మాత్రమే అవకాశం ఉంది. సంగారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్యరావుకు 2 మునిసిపాలిటీలో ఒక్కచోట మాత్రమే ఓటు వేయవచ్చు. ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, కొమరయ్య, యాదవ రెడ్డి వారి పరిధిలో ఎక్కడైనా ఓటు వేయవచ్చు.
News February 6, 2026
216 మంది BLA రెబల్స్‌ను హతమార్చాం: పాక్ ఆర్మీ

కొన్ని రోజులుగా బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో జరుగుతున్న ఘర్షణల్లో 216 మంది BLA రెబల్స్‌ను హతమార్చినట్లు పాక్ ఆర్మీ వెల్లడించింది. కీలక నేతలు, కమాండ్ కంట్రోల్ స్థావరాలను నేలకూల్చామని తెలిపింది. మరోవైపు ఈ ఆపరేషన్‌లో 36 మంది పౌరులు, 22 మంది సైనికులు కూడా చనిపోయినట్లు పేర్కొంది. కోల్, గోల్డ్, కాపర్, గ్యాస్ నిక్షేపాలు ఉన్న బలూచిస్థాన్ స్వాతంత్య్రం కోసం కొన్నేళ్లుగా పోరాటాలు జరుగుతున్నాయి.
News February 6, 2026
NLG: ప్రచారానికి ఇంకా నాలుగు రోజులే..

మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఇంకా నాలుగు రోజుల సమయమే ఉండటంతో నాయకులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఈనెల 9వ తేదీ సాయంత్రంతో ముగియనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కార్యకర్తలతో ఆయా డివిజన్, వార్డుల్లో విస్త్రత ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కొన్ని వార్డులలో అధికార, ప్రతిపక్షాలకు దీటుగా స్వతంత్ర అభ్యర్థుల ప్రచారం సాగుతుండడం విశేషం.


