News March 6, 2026
జగిత్యాలలో జిల్లాస్థాయి క్రీడా పోటీలు..!

జగిత్యాల జిల్లాలో అండర్ 14, 16, 17 వయస్సు గల బాలబాలికలకు జిల్లాస్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి తెలిపారు. ఇండియా క్రీడా కార్యక్రమంలో భాగంగా మార్చి 12న జగిత్యాలలో ఈ పోటీలు నిర్వహించనున్నారు. షాట్‌పుట్, లాంగ్ జంప్, 100 మీటర్ల పరుగు పందెం విభాగాల్లో పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు తమ వివరాలను మార్చి 7 నుంచి NSRS పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చన్నారు.
Similar News
News April 13, 2026
CMR జడ్జి కోర్టులో ఘనంగా పద్మం సిల్వర్ జువెలరీ ప్రారంభం

పద్మం సిల్వర్ జువెలరీ వారి మరొక శాఖను జడ్జి కోర్టు ఎదురుగా గల CMR షాపింగ్ మాల్‌లో CMR గ్రూపు సంస్థల డైరెక్టర్ మావూరి బాలాజీ, సతీమణి హారికతో కలిసి ప్రారంభించారు. ప్రారంభోత్సవ సందర్భంగా ఒక లక్ష రూపాయల విలువైన సిల్వర్ జువెలరీ కొనుగోలుపై రూ.50 వేల విలువైన సిల్వర్ జువెలరీ ఉచితంగా,రూ.50 వేల విలువైన సిల్వర్ జువెలరీ కొనుగోలుపై రూ.25 వేల విలువైన సిల్వర్ జువెలరీ ఉచితంగా అందిస్తున్నామన్నామని బాలాజీ తెలిపారు.
News April 13, 2026
నిర్మల్: ఒకే గ్రామం నుంచి ఇద్దరు టాపర్లు..!

మామడ మండలం కొరిటికల్ గ్రామం ఇంటర్ ఫలితాల్లో విద్యానగరిగా మారింది. సామల హర్షిత ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో 996/1000 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు కైవసం చేసుకుంది. అదే గ్రామానికి చెందిన వినీష ప్రథమ సంవత్సరంలో 469/470 మార్కులతో సత్తా చాటింది. ఒకే గ్రామం నుంచి ఇద్దరు విద్యార్థినులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించడంతో గ్రామస్థులు సంబరాలు జరుపుకుంటున్నారు.
News April 13, 2026
ఇంటర్ ఫలితాలు.. 8 మంది విద్యార్థుల ఆత్మహత్య

TG: ఇంటర్ ఫలితాల వేళ రాష్ట్రంలో తీవ్ర విషాదం నెలకొంది. పరీక్షల్లో పాసవ్వలేదనే కారణంతో పలు జిల్లాల్లో ఎనిమిది మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎగ్జామ్స్‌లో విఫలమవడమంటే జీవితంలోనే ఓడిపోవడం కాదనే విషయాన్ని మరిచి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు. మార్కులే భవిష్యత్తు కాదనే విషయాన్ని పిల్లలకు పేరెంట్స్, టీచర్స్ అర్థమయ్యేలా వివరించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఈ విషయంపై అవగాహన కల్పించాలి.


