News February 3, 2025

జగిత్యాలలో వాతావరణం ఎలా ఉందంటే..?

image

జగిత్యాలలో ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. సారంగాపూర్‌లో 16.7℃, మన్నెగూడెం 16.9, మల్లాపూర్, కొల్వాయి 17, నేరెల్ల 17.1, కథలాపూర్ 17.2, గోవిందారం, మెట్‌పల్లి, బుద్దేష్‌పల్లి 17.3, గోదురు, మద్దుట్ల 17.4, పెగడపల్లి, రాఘవపేట 17.5, కోరుట్ల, గుల్లకోట 17.6, తిరుమలాపూర్, ఐలాపూర్, జగిత్యాల, మల్యాల 17.7, వెల్గటూర్ 17.8, ఎండపల్లి 17.9, జగ్గసాగర్ 18.1, రాయికల్, జైన 18.2, మేడిపల్లిలో 18.3℃గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News April 14, 2026

సాగర్: టన్నెల్ డీప్ కట్‌లో రాళ్లు తొలగింపు జరిగేనా?

image

సాగర్ ఎడమ కాల్వలోని పొట్టి చెలిమ టన్నెల్ డీప్ కట్ ప్రాంతంలో ఏటా విరిగిపడుతున్న భారీ రాళ్లు నీటి ప్రవాహానికి ఆటంకంగా మారాయి. 2018లో ఆధునికీకరణ పనులు జరిగినప్పటికీ ఈ సమస్య పరిష్కారం కాలేదు. రాళ్ల వల్ల నీటి వేగం తగ్గి దిగువ ఆయకట్టుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుత వేసవిలోనైనా అధికారులు స్పందించి, ఆ రాళ్లను తొలగించి శాశ్వత మరమ్మత్తులు చేపట్టాలని సాగర్ ఆయకట్టు రైతులు కోరుతున్నారు.

News April 14, 2026

సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి: పొన్నం

image

TG: RTC ఉద్యోగులు <<19641755>>సమ్మె నిర్ణయాన్ని<<>> వెనక్కి తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. సంస్థ పరిరక్షణ, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందన్నారు. ఆర్టీసీ విలీనం, కార్మిక సంఘాల అంశాలు ప్రభుత్వ పరిధిలోనే ఉన్నాయని, దీనిపై ఇప్పటికే ఒక కమిటీ పనిచేస్తోందని తెలిపారు. సమస్యలు చెప్పుకోవడానికి తమ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు.

News April 14, 2026

దేశానికి అంబేడ్కర్ చేసిన సేవలు అనన్యం: కలెక్టర్

image

నరసరావుపేటలో అంబేడ్కర్‌ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. స్థానిక గడియార స్తంభం సెంటర్‌లోని అంబేడ్కర్‌ విగ్రహానికి కలెక్టర్‌ కృతిక శుక్లా పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి అంబేడ్కర్ చేసిన సేవలు అనన్యం అని ఆమె కొనియాడారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరూ పయనించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రజలు పాల్గొని అంజలి ఘటించారు.