News December 20, 2025
‘జగిత్యాలలో వెల్‌నెస్ హెల్త్ సెంటర్ ఏర్పాటుచేయాలి’

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, జర్నలిస్టు కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జగిత్యాల జిల్లా కేంద్రంలో ఒక వెల్‌నెస్ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరుతూ PRTUTS జగిత్యాల జిల్లా శాఖ నాయకులు ఎమ్మెల్యే సంజయ్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఆనంద్ రావు, ప్రధాన కార్యదర్శి యాల్ల అమర్నాథ్ రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
Similar News
News December 23, 2025
మేడారం: ఇంకా 36 రోజులే.. SLOWగా పనులు..!

మేడారం జాతరకు మరో 36 రోజులే గడువు ఉంది. సాధారణంగా జాతరకు 15 రోజుల ముందు నుంచే అమ్మవార్లను దర్శించుకునేందుకు జనం వస్తుంటారు. కాగా, జాతర ప్రాంతంలో అభివృద్ధి పనులు నెమ్మదిగా సాగుతన్నాయి. మరోపక్క మేడారానికి చేరుకునే రోడ్లపై ఉన్న వంతెనలు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. సమ్మక్క మాల ధరించి మరీ అధికారులుందరూ ఇక్కడే ఉండి జాతర పనులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినా అలాంటి పరిస్థితేమీ కన్పించట్లేదు.
News December 23, 2025
TPT: అన్యమతస్థులతో గోవిందరాజస్వామి ఆలయ పనులు..?

గోవిందరాజస్వామి ఆలయం విమాన గోపురం బంగారు తాపడం పనులు కాంట్రాక్టర్ జ్యోత్ టెండర్ ద్వారా దక్కించుకుని మరో ఇద్దరు అన్యమతస్థులకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిందని ప్రచారం జరిగింది. అయితే వారికి ఎలాంటి రాతపూర్వకంగా ఇవ్వలేదని విజిలెన్స్ అధికారులు తేల్చారు. కాగా పనుల్లో అవకతవకలు, విగ్రహాలు తొలగించడంపై హిందూ సంఘాలు ఆరోపణల చేశాయి. తాజాగా ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో టీటీడీ విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు సమాచారం.
News December 23, 2025
హుజూరాబాద్ నుంచి శబరిమలకి సూపర్ లగ్జరీ సర్వీస్

హుజూరాబాద్, జమ్మికుంట ప్రాంతాల అయ్యప్ప స్వామి భక్తులకు ఆర్టీసీ శుభవార్త తెలిపింది. ప్రతి ఏడాది మకరజ్యోతి, మండల పూజల సందర్భంగా లక్షలాది మంది అయ్యప్ప భక్తులు శబరిమలకి ప్రయాణం చేస్తున్న నేపథ్యంలో వారి సౌకర్యార్థం హుజూరాబాద్ నుంచి నేరుగా శబరిమలకి ప్రత్యేక సూపర్ లగ్జరీ సర్వీసులను ఏర్పాటు చేసింది. జనవరి 12 సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ సర్వీసులు హుజూరాబాద్ డిపో నుంచి బయలుదేరుతాయని మేనేజర్ పేర్కొన్నారు.


