News December 30, 2025

జగిత్యాల్: 5 ఏళ్ల తర్వాత ఆ ఊరికి ఆర్టీసీ బస్సు

image

రాయికల్ మండలంలోని కిష్టంపేటకు ఐదేళ్ల నిరీక్షణ తర్వాత ఆర్టీసీ బస్సు సర్వీసు పునఃప్రారంభమైంది. కరోనా కాలంలో బస్సు సర్వీసు నిలిపేయగా మళ్లీ ప్రారంభించాలని గ్రామస్థులు ఏన్నో సార్లు కోరారు. ఇటీవల సర్పంచ్ అంజయ్య పాలకవర్గం DMకు వినతిపత్రం ఇవ్వగా సానుకూలంగా స్పందించారు. మంగళవారం గ్రామానికి చేరుకున్న బస్సుకు సర్పంచ్, ప్రజలు ఘనస్వాగతం పలికారు. రవాణా కష్టాలు తీరడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News January 1, 2026

కర్రపెండలంలో జింక్ లోప లక్షణాలు – నివారణ

image

కర్రపెండలంలో మొక్కలో జింక్ లోపం వల్ల ఆకులు సన్నగా, పసుపుగా మారి పైకి వంకరగా ఉంటాయి. పెరుగుతున్న లేత మొక్క భాగంపై ప్రభావం ఎక్కువగా ఉండి, పెరుగుదల తగ్గుతుంది. లేత ఆకులలో ఈనెల ముఖ్య భాగం పసుపు రంగులోకి మారుతుంది. లోప నివారణకు 5KGల జింక్ సల్ఫేట్ భూమిలో వేసి కప్పాలి. 1-2% జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని 3-4 సార్లు పిచికారీ చేయాలి. ముచ్చెలను 2-4% జింక్ సల్ఫేట్ ద్రావణంలో 15 నిమిషాలు ముంచిన తర్వాత నాటుకోవాలి.

News January 1, 2026

విశాఖలో మందుబాబుల తాట తీసిన పోలీసులు

image

విశాఖలో పోలీసులు కొత్త సంవత్సరం వేళ మందుబాబులపై గురిపెట్టి ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు 50చోట్ల ట్రాఫిక్ పోలీసులు బృందాలుగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 240 మంది మద్యం సేవించినట్లు గుర్తించి కేసులు నమోదు చేశారు. వెంటనే వాహనాలు స్వాధీనం చేసుకొని స్టేషన్లకు తరలించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఇవాళ కూడా తనిఖీలు జరుగుతాయన్నారు.

News January 1, 2026

అల్లూరి: డీఈవోకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పిన ఉపాధ్యాయులు

image

మన్యం జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీ గురువారం సాలూరు వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక బాలికొన్నత పాఠశాలలో సాలూరు, పాచిపెంట మండలాలకు చెందిన ఉపాధ్యాయులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డీఈవో మాట్లాడుతూ..ఈ కొత్త సంవత్సరం అందరికీ శుభాలు కలగాలని ఆకాక్షించారు. వీరితో పాటు డిప్యూటీ డీఈవో రాజ్ కుమార్, సాలూరు, పాచిపెంట మండలాలకు చెందిన ఎంఈఓలకు, ఉపాధ్యాయ బృందాలు అభినందనలు తెలిపారు.