News April 14, 2025
జగిత్యాల: అంబేడ్కర్‌కు ఘన నివాళులు

భారతరత్న డా. బి.ఆర్. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని తహసిల్ చౌరస్తాలో విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అట్లూరి లక్ష్మణ్ కుమార్ పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి, కలెక్టర్ సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్, అదనపు కలెక్టర్ లత, సంఘ సభ్యులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
Similar News
News April 15, 2025
NGKL జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ సదరమ్ క్యాంపు

నాగర్ కర్నూలు జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యాలయంలో రెన్యువల్ సదరం సర్టిఫికెట్ల కోసం సంబంధిత దివ్యాంగులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డీఆర్డీఏ కార్యాలయం రూమ్ నంబర్ ఎఫ్1లో స్లాట్ పొందాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి చిన్న ఓబులేశ్ తెలిపారు. ఈనెల 23 నుంచి 28 వరకు శారీరక దివ్యాంగుల క్యాంపు నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహిస్తారని తెలిపారు.
News April 15, 2025
IPL: పాపం పంజాబ్

గత మ్యాచులో SRH చేతిలో ఓటమి మూటగట్టుకున్న పంజాబ్ తాజాగా KKRతో మ్యాచులోనూ పీకల్లోతు కష్టాల్లో పడింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు 9.1 ఓవర్లలో 76 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు ప్రియాంశ్ 22, ప్రభ్‌సిమ్రన్ 30 రన్స్ చేయగా, కెప్టెన్ శ్రేయస్ డకౌట్ అయ్యారు. ఇంగ్లిస్(2), వధేరా(10), మ్యాక్సీ(7) విఫలమయ్యారు. KKR బౌలర్లలో హర్షిత్ 3, వరుణ్ 2 వికెట్లతో సత్తా చాటారు.
News April 15, 2025
నాగర్‌కర్నూల్: 1,34,503 జవాబు పత్రాల మూల్యాంకనం: డీఈవో

NGKL జిల్లాలో పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసిందని డీఈవో రమేశ్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,34,503 ప్రశ్నాపత్రాలను పారదర్శకంగా మూల్యాంకనం చేసి ప్రభుత్వానికి పంపామని అన్నారు. 64 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 384 అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 130 స్పెషల్ అసిస్టెంట్‌లు మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేశారని పేర్కొన్నారు. పాల్గొన్న ఉపాధ్యాయులను డీఈవో సన్మానించారు.