News March 20, 2025

జగిత్యాల: అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించాలి: అడిషనల్ కలెక్టర్

image

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులలో జాప్యం లేకుండా త్వరగా పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం అందించాలని అడిషనల్ కలెక్టర్ బిఎస్.లత అన్నారు. షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జగిత్యాలలో గురువారం నిర్వహించిన డిస్టిక్ లెవెల్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. సమావేశంలో ఆర్డీవోలు మధుసూదన్, జివాకర్ రెడ్డి, శ్రీనివాస్, డిఎస్పీలు రఘుచందర్, రాములు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News March 21, 2025

SLBC టన్నెల్ ప్రమాదంపై అధికారుల సమీక్ష

image

SLBC టన్నెల్ లో జరుగుతున్న సహాయక చర్యలపై అధికారులు సమీక్ష నిర్వహించారు. పనులను వేగవంతం చేసేందుకు అన్ని విభాగాలను సమన్వయం చేస్తున్నట్లు తెలిపారు. భద్రతా ప్రమాణాలను పాటిస్తూనే సహాయక చర్యలను కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 22న టన్నెల్ ప్రమాదం జరగగా 8మంది కార్మికులు టన్నెల్‌లో చిక్కుకున్నారు. వీరిలో ఒక ఇంజినీర్ మృతదేహం లభించింది.

News March 21, 2025

అవసరం లేనిది వదిలేయండి: జిల్లా కలెక్టర్

image

KMM: మన ఇంట్లో మనకు అవసరం లేని వస్తువులు ఇతరులకు ఉపయోగ పడవచ్చని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్, జిల్లా ప్రధాన ఆసుపత్రి ఎదురుగా వాల్ ఆఫ్ కైండ్ నెస్ గోడను అ.కలెక్టర్ శ్రీజ, ట్రైన్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, DFO సిద్దార్థ్ విక్రమ్ సింగ్‌లతో కలిసి ప్రారంభించారు. ప్రజలు తమ ఇంట్లో అవసరం లేని వస్తువులు, పాత సామాన్లు, బట్టలు వదిలితే అవి అవసరం ఉన్నవారుతీసుకొని వెళ్తారన్నారు.

News March 21, 2025

సిద్దిపేట: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు..

image

కుకునూరుపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద రాజీవ్ రహదారిపై గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఎస్ఐ శ్రీనివాస్ కథనం.. గజ్వేల్ మండలం దిలాల్పూర్‌కు చెందిన క్యాసారం బాబు సిద్దిపేట నుంచి గజ్వేల్ వెళ్తుండగా బైక్ అదుపుతప్పి డివైడర్ మధ్యలో స్తంభానికి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెనక కూర్చున్న యాదగిరికి తీవ్ర గాయాలయ్యాయి.

error: Content is protected !!