News July 10, 2025
జగిత్యాల: అడ్రస్ మారినా అప్‌డేట్ చేయని అధికారులు

జగిత్యాల ఆర్టీఏ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. దాదాపుగా రెండేళ్ల క్రితమే జగిత్యాల జిల్లా ఆర్టీఏ కార్యాలయం తాటిపల్లి గ్రామానికి తరలించగా, ప్రస్తుతం స్లాట్ బుక్ చేసుకుంటున్న వారికి డ్రైవింగ్ టెస్ట్ సెంటర్ ధరూర్ క్యాంపు అని చూపించడంతో అవాక్కవుతున్నారు. ఆర్టీఏ కార్యాలయం, డ్రైవింగ్ టెస్ట్ సెంటర్ మారినా వెబ్‌సైట్‌లో ఇంకా అడ్రస్ అప్‌డేట్ చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Similar News
News July 11, 2025
సిద్దిపేట: ఆయిల్ పామ్ సాగు వైపు రైతులను ప్రోత్సహించాలి: కలెక్టర్

ఆయిల్ పామ్ సాగు వైపు రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ హైమావతి అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్‌తో కలిసి ఆయిల్ ఫెడ్, వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో ఆయిల్ ఫామ్ తోటల పెంపకంపై సమీక్షా నిర్వహించారు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సువర్ణ జిల్లాలో సాగు పురోగతిని వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు.
News July 11, 2025
వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి: కలెక్టర్

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, అన్ని చోట్లా ఫాగింగ్ చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశామయ్యారు. అన్ని వసతి గృహాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, పారిశుద్ధ్య చర్యలు పక్కాగా చేపట్టాలని సూచించారు. దోమల నివారణలో భాగంగా వీధులలో క్రమం తప్పకుండా ఫాగింగ్ చేయాలని చెప్పారు.
News July 11, 2025
మెదక్: ఢిల్లీ నేషనల్ వర్క్ షాప్‌లో కలెక్టర్

ఢిల్లీలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్ పై జరిగిన నేషనల్ వర్క్ షాప్‌లో కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలలో అమలవుతున్న నూతన కార్యక్రమాలు, పోషణ శిక్షణకు సంబంధించిన కార్యక్రమాల గురించి వివిధ రాష్ట్రాల ప్రతినిధులతో చర్చించినట్లు తెలిపారు. ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.