News November 22, 2025
జగిత్యాల అదనపు ఎస్పీగా శేషాద్రిని రెడ్డి బాధ్యతలు

జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీగా శేషాద్రిని రెడ్డి ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో విధుల్లో చేరిన అనంతరం, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. కొత్త అదనపు ఎస్పీ బాధ్యతలు స్వీకరించడంతో జిల్లా పోలీసు వ్యవస్థలో చైతన్యం నెలకొనున్నదని అధికారులు పేర్కొన్నారు.
Similar News
News November 23, 2025
పంచాయతీ ఎన్నికలకు సిద్ధం: MHBD కలెక్టర్

మహబూబాబాద్ జిల్లాలోని 482 పంచాయతీలు, 4,110 వార్డులకు 3 దశల్లో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ రూపొందించి ఎస్‌ఈసీకి పంపినట్లు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. మొదటి దశలో 155 పంచాయతీలు, రెండో దశలో 158, మూడో దశలో 169 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించినట్లు కలెక్టర్ వివరించారు. రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ సూచన మేరకు పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
News November 23, 2025
HYD: ఇవాళ ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ రెడ్డి

ఇవాళ మద్యాహ్నం ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. DEC 8 నుంచి 11వ తేది వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్- 2025ను నిర్వహిస్తోంది. పనుల ఏర్పాట్లను పలువురు మంత్రులు, అధికారులతో కలిసి సీఎం పరిశీలించనున్నారు. రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్ పేటలో 300 ఎకరాల విస్తీర్ణంలో సమ్మిట్ నిర్వహణ ఏర్పాట్లు చేశారు. దీనికి 3వేల మంది అతిథులు రానున్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు.
News November 23, 2025
కృష్ణా: బెల్టు షాపులపై ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్.!

గ్రామస్థాయిలో బెల్టు షాపు కనిపిస్తే ‘బెల్టుతీస్తా’ అన్న ప్రభుత్వ ఆదేశాలు జిల్లాలో ఎక్కడా కనిపించడం లేదని ప్రజల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైన్ షాప్ నిర్వాహకులే నేరుగా మద్యం డోర్ డెలివరీ ప్రారంభించడంతో బెల్టు వ్యాపారం అడ్డదారులు వేస్తూ దూసుకుపోతోందని సమాచారం. ఎక్సైజ్ మంత్రి సొంత జిల్లాలోనే మద్యం ఏరులై పారుతుంటే, ఆ శాఖ అధికారులు ఈ దందాలో భాగస్వాములా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.


