News March 19, 2025

జగిత్యాల: అప్పుల బాధతో ఉరివేసుకుని రైతు ఆత్మహత్య

image

జగిత్యాల మండలం వెల్దుర్తి గ్రామానికి చెందిన మతలాపురం రాజం(55) ఊరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం జరిగింది. సాగుకు, ఇంటి అవసరాలకు రూ.10 లక్షలు అప్పుకావడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి కుమారుడు మల్లేష్ తెలిపారు. మల్లేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Similar News

News July 5, 2025

ఈనెల 10న జిల్లా వ్యాప్తంగా మెగా పీటీఎం: కలెక్టర్

image

జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీలలో ఈనెల 10న మెగా పీటీఎం 2.0 కార్యక్రమం
నిర్వహించాలని విద్యాశాఖ అధికారులను కర్నూలు క‌లెక్ట‌ర్ పి.రంజిత్ బాషా జిల్లా శనివారం ఆదేశించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సమన్వయం కోసమే పీటీఎం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మెగా పీటీఎం 2.0 కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని సూచించారు.

News July 5, 2025

విశాఖలో డ్రగ్స్ కలకలం.. ఐదుగురి అరెస్ట్

image

విశాఖలో శనివారం డ్రగ్స్ కలకలం రేపాయి. 25 గ్రాముల మత్తు పదార్థం కలిగి ఉన్న ఒక విదేశీయుడుతో పాటు మరో నలుగురిని త్రీటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఎవరికి విక్రయిస్తున్నారనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News July 5, 2025

PNB కేసు.. నీరవ్ మోదీ సోదరుడు అరెస్ట్

image

వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సోదరుడు నేహాల్ మోదీని అమెరికా అధికారులు అరెస్ట్ చేశారు. భారత ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆయన్ను ఈనెల 4న అరెస్ట్ చేసినట్లు అక్కడి అధికారులు తెలిపారు. అతడిని భారత్‌కు అప్పగించే ప్రక్రియ మొదలైనట్లు సమాచారం. పంజాబ్ నేషనల్ బ్యాంకు(PNB)ను రూ.14వేల కోట్లకు మోసం చేసిన కేసులో నీరవ్ మోదీ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదే కేసులో నేహాల్‌ అభియోగాలు ఎదుర్కొంటున్నారు.