News February 2, 2025

జగిత్యాల: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

image

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం కలిగోట గ్రామానికి చెందిన డిచ్పల్లి పెద్ద గంగారం (48) అనే రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. రైతు సాగుతో పాటు గొర్రెల కాపరిగా పనిచేస్తారు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో పెద్ద గంగారాం శనివారం రాత్రి గ్రామశివారులోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నవీన్ కుమార్ పేర్కొన్నారు.

Similar News

News September 13, 2025

ఒంటరిగా ఉండకండి.. ఇది ప్రమాదకరం!

image

ప్రస్తుతం ఒంటరితనం ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది. సోషల్ మీడియాలో ఉంటూ సమాజానికి దూరం కావడం, ఆర్థిక పరిస్థితులు, పట్టణీకరణ వంటి కారణాలతో ఒంటరితనం పెరిగినట్లు WHO పేర్కొంది. ఇది కేవలం మానసిక సమస్య కాదు, గుండె జబ్బులు, డిప్రెషన్‌ వంటి ఆరోగ్య సమస్యలకూ దారితీస్తుంది. దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా ఏటా 8,71,000 మందికిపైగా చనిపోతున్నట్లు వెల్లడించింది. అంటే ఒంటరితనం వల్ల గంటకు 100 మంది చనిపోతున్నారన్నమాట.

News September 13, 2025

NRPT: ముఖ్యమంత్రిని కలిసిన మంత్రి, ఎమ్మెల్యే

image

నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూ నిర్వాసితులకు నష్టపరిహారం పెంచారని శనివారం హైద్రాబాద్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయనను క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎకరాకు రూ.14 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. భూ సేకరణ పనులు వేగంగా చేపడుతామని చెప్పారు. మాజీ డీసీసీ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి ఉన్నారు.

News September 13, 2025

KNR: సమగ్ర శిక్ష వ్యాయమ జిల్లా అధ్యక్షుడిగా ప్రకాష్ గౌడ్

image

సమగ్ర శిక్ష వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా వంగ ప్రకాష్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా సొల్లు అనిల్ కుమార్, ఉపాధ్యక్షులుగా రజితలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వంగ ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరి ధన్యవాదాలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన వారికి వ్యాయామ ఉపాధ్యాయులు శుభాకాంక్షలు చెప్పారు.