News February 2, 2025

జగిత్యాల: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

image

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం కలిగోట గ్రామానికి చెందిన డిచ్పల్లి పెద్ద గంగారం (48) అనే రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. రైతు సాగుతో పాటు గొర్రెల కాపరిగా పనిచేస్తారు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో పెద్ద గంగారాం శనివారం రాత్రి గ్రామశివారులోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నవీన్ కుమార్ పేర్కొన్నారు.

Similar News

News February 2, 2025

KNR: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్.. ప్రజావాణి రద్దు: కలెక్టర్

image

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఈనెల 3న నిర్వహించే ప్రజా వాణి కార్యక్రమం రద్దు చేయడంతో పాటు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక పూర్తయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించమని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఫిర్యాదులు చేయాలనుకునే వారు ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తియిన తర్వాత రావాలని చెప్పారు.

News February 2, 2025

కేంద్ర బడ్జెట్‌పై కరీంనగర్ MP ప్రశంసలు

image

కేంద్ర బడ్జెట్ 2025-26 కేవలం లెక్కల పద్దు మాత్రమే అని, ఇది ప్రధాని మోదీ దార్శనికత, స్వావలంబన, వృద్ధి, శ్రేయస్సుతో కూడిన వికసిత భారత్‌కు ఒక రోడ్ మ్యాప్ అని కరీంనగర్ MP, కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. రైతు సంక్షేమం, మధ్యతరగతికి ఉపశమనం, మహిళలు, యువతకు సాధికారత కల్పించడం, స్టార్టప్‌లకు ప్రోత్సాహం వంటివి ఈ బడ్జెట్‌లో చూడవచ్చన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులను ప్రోత్సహించారని వివరించారు.

News February 1, 2025

KNR: రేపు కళాభారతిలో రాష్ట్ర దివ్యాంగుల పట్టభద్రుల సంఘం వార్షికోత్సవం

image

KNR కళాభారతిలో రాష్ట్ర దివ్యాంగుల పట్టభద్రుల సంఘం 8వ వార్షికోత్సవం సందర్భంగా ఆదర్శ దివ్యాంగుల ఆత్మీయ అభినందన సభను రేపు నిర్వహించనున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు మొగిలి లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి జగదీశ్వరాచారి తెలిపారు. ఇందులో భాగంగా వివిధ రంగాల్లో స్వయం ఉపాధి పొందుతున్న వారిని దివ్యాంగ స్వయం కృషి అవార్డుతో సత్కరిస్తామని వారు పేర్కొన్నారు. దివ్యాంగ మిత్రులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.