News December 30, 2025
జగిత్యాల అభ్యర్థులకు ఖమ్మంలో EXAM CENTER

టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET)కు దరఖాస్తు చేసుకున్న జగిత్యాల జిల్లా అభ్యర్థులకు దూర ప్రాంతమైన ఖమ్మం జిల్లాలో పరీక్ష కేంద్రాలు కేటాయించడంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నోటిఫికేషన్ విడుదలైన మొదటి రోజే దరఖాస్తు చేసుకున్నప్పటికీ, సమీప జిల్లాల్లో కాకుండా సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖమ్మంలో పరీక్షా కేంద్రాలు అలాటవ్వడం అన్యాయమన్నారు. మహిళలకు మరింత ఇబ్బందులు తలెత్తనున్నాయని అన్నారు.
Similar News
News December 31, 2025
జగిత్యాల: విద్యా దీవెన దరఖాస్తులు మార్చి 31 వరకు

జగిత్యాల జిల్లాలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి SC, ST, BC, OC, మైనారిటీ విద్యార్థుల విద్యా దీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్ దరఖాస్తులపై జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి రాజ్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. అర్హులైన విద్యార్థులు ఫ్రెష్, రెన్యువల్ దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. దరఖాస్తుల చివరి తేదీ 31 మార్చి 2026 కాగా, దరఖాస్తులు E-PASS వెబ్‌సైట్ ద్వారా మాత్రమే చేయాలని సూచించారు.
News December 31, 2025
9 మందికి రూ.18 లక్షల పింఛన్లు అందజేసిన మంత్రి అచ్చెన్న

గత ప్రభుత్వం హయాంలో ఆగిన 9 మందికి రూ.18 లక్షల పింఛన్లను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం కోటబొమ్మాళిలో అందించారు. నందిగామ మండలం దీనబంధుపురం గ్రామానికి చెందిన వీరికి మధ్యలో ఆగిపోగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అనంతరం మంజూరైన పెన్షన్లను అందజేశారు. RDO కృష్ణమూర్తి, మాజీ పీఎసీఎస్ ఛైర్మన్ వరప్రసాద్, ఎంపీడీవో ఫణీంద్ర కుమార్ ఉన్నారు.
News December 31, 2025
జమ్మికుంట: నిలకడగానే పత్తి గరిష్ఠ ధర

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో పత్తి గరిష్ఠ ధర నిలకడగానే ఉంది. బుధవారం యార్డుకు 23 వాహనాల్లో 203 క్వింటాళ్ల విడి పత్తిని రైతులు తీసుకొని రాగా.. గరిష్ఠంగా క్వింటాకు రూ.7,400, కనిష్ఠంగా రూ.6,900లకు ప్రైవేట్ వ్యాపారులు బహిరంగ వేలం ద్వారా కొనుగోలు చేశారు. మార్కెట్ కార్యకలాపాలను ఉన్నత శ్రేణి కార్యదర్శి రాజా పరిశీలించారు.


