News October 15, 2024
జగిత్యాల: అర్దరాత్రి దారుణ హత్య

జగిత్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కోరుట్ల పట్టణంలో యువకుడు హత్యకు గురయ్యాడు. స్థానికుల ప్రకారం.. పట్టణంలోని ప్రకాశం రోడ్డుకు చెందిన బోయిని సాగర్(33) అనే యువకుడిపై సోమవారం అర్దరాత్రి దుండగులు కత్తితో దాడి చేశారు. తీవ్ర గాయాలైన సాగర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి సీఐ సురేశ్ బాబు, ఎస్సై శ్రీకాంత్ చేరుకొని హత్యకు గల కారణాలపై విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 17, 2026
కరీంనగర్ ‘నగరాధిపత్యం’ కమలం వశం!

కరీంనగర్ మున్సిపల్ పోరులో బీజేపీ ఉత్కంఠ విజయం సాధించింది. మేయర్ ఎన్నికలో బీఆర్ఎస్ తటస్థంగా ఉండటంతో, మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలోని కాంగ్రెస్ ఆశలు గల్లంతయ్యాయి. బండి సంజయ్ వ్యూహంతో కొలగాని శ్రీనివాస్ మేయర్‌గా పీఠమెక్కారు. దశాబ్ద కాలం నగరాన్ని ఏలిన గులాబీ పార్టీ కేవలం 9 స్థానాలకే పరిమితమై ఉనికి కోసం పోరాడుతోంది. ప్రస్తుతం జిల్లా రాజకీయం బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యే హోరాహోరీగా సాగుతోంది.
News February 17, 2026
కరీంనగర్‌లో రేపు జాబ్ మేళా

నిరుద్యోగ యువతీయువకులకు రేపు జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి తిరుపతిరావు ఒక ప్రకటనలో తెలిపారు. కరీంనగర్లోని గోదావరిఖని బైపాస్ రోడ్డు కేబుల్ వంతెన సమీపంలోగల ఓ కంపెనీలో ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయన్నారు. టీమ్ లీడర్, సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ ఆఫీసర్, ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్స్ సహా మొత్తం 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. వివరాలకు కాల్- 9908230384.
News February 16, 2026
కరీంనగర్ మేయర్ పీఠంపై సందిగ్ధత!

కరీంనగర్ నగరపాలక సంస్థలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. మేయర్ పీఠం దక్కించుకునేందుకు బీజేపీకి 34 ఓట్ల బలం ఉండగా, కాంగ్రెస్ కూటమికి 35 ఓట్లు ఉన్నట్లు భావించారు. అయితే, అనూహ్యంగా బీఆర్ఎస్ మద్దతు ఉపసంహరించుకున్నట్లు జరుగుతున్న ప్రచారంతో ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ సహకరించని పక్షంలో మేయర్ పీఠం కమలం వశమయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.


