News September 7, 2025
జగిత్యాల: ‘అవినీతి లేని ఉత్తమ వృత్తి.. ఉపాధ్యాయ వృత్తి’

తండ్రి ఆస్తులు అందిస్తే.. గురువు జ్ఞానాన్ని అందిస్తాడని, జ్ఞానం మీ సంపద అయితే విజయం నీ బానిస అవుతుందని MLC చిన్నమయిల్ అంజిరెడ్డి అన్నారు. జగిత్యాల కలెక్టరేట్‌లో ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల అందజేత కార్యక్రమంలో ఆదివారం ఆయన మాట్లాడారు. అవినీతి లేని ఉత్తమ వృత్తి ఉపాధ్యాయ వృత్తి అన్నారు. కెరీర్ గైడెన్స్ అనే పుస్తకం విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని ఈ పుస్తకాన్ని విద్యార్థులకు అందించాలన్నారు.
Similar News
News September 8, 2025
HYD: అటు ఆనందం, ఇటు ఆర్తనాదం

అందరిదేమో ఆనందం.. కొందరిదేమో ఆర్తనాదం. బొమ్మ బొరుసు వలే ఈ రెండు ఉంటాయనడానికి పైఫొటో ఉదాహరణ. ఆదివారం ట్యాంక్‌బండ్ మీద నిమజ్జనోత్సవంలో కొన్ని దృశ్యాలు ఉత్సాహం నింపితే, మరికొన్ని గుండెను బరువెక్కించాయి. ఆటపాటల్లో మునిగిన సెక్రటేరియట్ ఎదుట మాసిపోయిన చీర, ఒంటినిండా గాయాలతో ఓ తల్లి భిక్షాటన చేసింది. దిక్కుతోచని స్థితిలో ఆ బాలుడు దీనంగా చూస్తుండిపోయాడు. వారి బతుకు చిత్రం చూసి భక్తులు చలించిపోయారు.

చరిత్ర సృష్టించిన తెలంగాణ ఆర్చర్ చికిత

ఇటీవల కెనడాలో జరిగిన వరల్డ్ ఆర్చరీ యూత్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ ఆర్చర్ తనిపర్తి చికిత రికార్డు సృష్టించారు. జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌గా పరిగణించే ఈ పోటీల్లో చికిత కాంపౌండ్ అండర్-21 ఉమెన్స్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణపతకం సాధించారు. TSలోని పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన చికిత తండ్రి ఆధ్వర్యంలోనే శిక్షణ పొందారు. ఈమె ఇప్పటికే పలుజాతీయస్థాయి పతకాలు సొంతం చేసుకున్నారు.