News December 1, 2025
జగిత్యాల: అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు డాక్టరేట్

జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ సుజాత వృక్షశాస్త్రంలో డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. వృక్షశాస్త్రంలో టిష్యూ కల్చర్ ఫోటో కెమికల్ అనాలసిస్ అండ్ ఫార్మా కాలజికల్ స్టడీస్ ఇన్ రూబియా కార్డిఫోలియా అనే ముకపైనా రీసెర్చ్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా సుజాతను ప్రిన్సిపల్ రామకృష్ణ, అధ్యాపకులు అభినందించారు.
Similar News
News March 9, 2026
NZB: ఈ నెల 10న జాబ్ మేళా

ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 10న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా ఉపాధి అధికారి మధుసూదన్ రావు తెలిపారు. ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, బీ.టెక్ పూర్తి చేసినవారు అర్హులని చెప్పారు. ఆసక్తి గల వారు ధ్రువపత్రాలతో నిజామాబాద్‌లోని జిల్లా ఉపాధి కార్యాలయానికి రావాలని సూచించారు. 18-35 ఏళ్ల లోపు వారు అర్హులని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News March 9, 2026
MBNR: తల్లిదండ్రులను కోల్పోయి.. అనాథగా పసిపాప..!

తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మిగిలిన సంఘటన MBNR(D) నవాబుపేట మండలంలోని చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన రవి (25) లావణ్య (22) దంపతులు. వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. అప్పుల బాధతో మార్చి 5న ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అదే రోజు లావణ్య మృతి చెందింది. చికిత్స పొందుతూ ఆదివారం రవి మృతి చెందాడు. హనీ(11) నెలల పసిపాప తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారి నాయనమ్మ సంరక్షణలో ఉంది.
News March 9, 2026
రేపు, ఎల్లుండి పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్న మంత్రి

మంత్రి శ్రీధర్ బాబు ఈనెల 10, 11వ తేదీల్లో మంథని నియోజకవర్గంలో పర్యటించనున్నారు. 10న మంథని మున్సిపాలిటీలో ప్రత్యేక సమావేశం, గాంధీచౌక్‌లో కాంగ్రెస్ విజయోత్సవ సభలో పాల్గొంటారు. 11న పెద్దపల్లిలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం మంథని మండలంలోని గుమ్మనూరు గ్రామపంచాయతీ ప్రారంభం, బీటీ రోడ్ శంకుస్థాపన, మంథనిలో ఇఫ్తార్ విందు, రామగిరి జేఎన్టీయూ కళాశాల వార్షికోత్సవంలో పాల్గొంటారు.


