News February 9, 2026
జగిత్యాల: ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల ప్రారంభం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈనెల 9 నుంచి 13వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల సందర్భంగా కలెక్టర్ సత్యప్రసాద్ జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ కుమార్‌తో కలిసి గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కేవైసీ నవీకరణ సురక్షిత బ్యాంకింగ్‌కు తొలి అడుగని తెలిపారు. కేవైసీ వివరాలు నవీకరించుకోవడం ద్వారా ఖాతాల దుర్వినియోగాన్ని నివారించవచ్చని అన్నారు.
Similar News
News April 14, 2026
HYDలో 40 దాటింది.. జాగ్రత్త!

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఎండల తీవ్రత పెరిగింది. మేడ్చల్ ఇండస్ట్రియల్ ఏరియా, కీసర ప్రాంతాల్లో గరిష్టంగా 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దుండిగల్, దమ్మాయిగూడ, మేడిపల్లి ప్రాంతాల్లో కూడా 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసి, ఎండలో బయటకు వెళ్లవద్దని సూచించింది.
SHARE IT
News April 14, 2026
MTM: ప్రభుత్వ కార్యక్రమానికి జనసేన డుమ్మా!

మచిలీపట్నంలో జరిగిన అంబేడ్కర్ జయంతి వేడుకలు రాజకీయ చర్చకు దారితీశాయి. ప్రభుత్వ కార్యక్రమాలకు జనసేన నేతలు గైర్హాజరు కాగా, మంత్రి కొల్లు రవీంద్రతో ఉన్న విభేదాల వల్లే వారు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. లక్ష్మీ టాకీస్ సెంటర్‌లో కూడా ఇరు పార్టీల నేతలు వేర్వేరుగానే నివాళులర్పించారు. పొత్తులో ఉన్నప్పటికీ సంస్థాగత విబేధాల కారణంగా నేతలు కలిసి పని చేయకపోవడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.
News April 14, 2026
బిహార్ కొత్త సీఎం.. తల్లిదండ్రుల నుంచి రాజకీయ వారసత్వం

బిహార్ కొత్త CMగా ఎన్నికైన సామ్రాట్ చౌదరి 1968లో జన్మించారు. ఈయన తండ్రి శకుని చౌదరి 7 సార్లు MLA, ఓసారి MPగా గెలిచారు. తల్లి పార్వతి తారాపూర్ MLAగా పని చేశారు. 1990లో RJD నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఆ తర్వాత JDU, 2017లో BJPలో చేరారు. 2024 నుంచి Dy.CMగా ఉన్నారు. 2014-19, 2020-25 వరకు రెండుసార్లు MLCగా ఉన్నారు. కుశ్వాహా సామాజిక వర్గానికి చెందిన ఈయనకు ఆ వర్గంలో మంచి పట్టుంది.


