News March 24, 2025
జగిత్యాల: ఆ ప్రాంతంలో MLA ఉప ఎన్నికలు అనివార్యమేనా?

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. రేపు ఈ కేసును ధర్మాసనం విచారించనుంది. ఈ క్రమంలో జగిత్యాలలో BRS నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన సంజయ్ కుమార్‌పై అనర్హత వేటు పడుతుందా.. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. జగిత్యాలలో ఉప ఎన్నికలు జరుగుతాయా అని స్థానికంగా జోరుగా చర్చ నడుస్తోంది. దీనిపై మీ కామెంట్?
Similar News
News March 26, 2025
రుద్రవరంలో రాష్ట్రంలోనే అత్యధికం..!

నంద్యాల జిల్లాలో కొద్ది రోజులుగా భానుడు విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) గణాంకాల ప్రకారం మంగళవారం నంద్యాల జిల్లా రుద్రవరంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 41.6°C ఉష్ణోగ్రత నమోదైంది. వేసవి కాలం ప్రారంభంలోనే ఈ స్థాయిలో భానుడు విరుచుకుపడటంపై ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కాగా, కొద్దిరోజులుగా నంద్యాల జిల్లాలోనే అధిక ఉష్ణోగ్రత నమోదవుతుండటం గమనార్హం.
News March 26, 2025
నిర్మల్ ఎస్పీ క్యాంప్ ఆఫీస్‌లో నేడు ఇఫ్తార్ విందు

నిర్మల్ పోలీస్ మీ పోలీస్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ముస్లిం పోలీసు సిబ్బందికి బుధవారం ఇఫ్తార్ విందు ఇవ్వనున్నట్లు ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల తెలిపారు. జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సాయంత్రం 6 గంటలకు నిర్వహించే ఇఫ్తార్ విందులో ముస్లిం పోలీసులు పాల్గొనాలని కోరారు.
News March 26, 2025
మా ఓటమికి అదే కారణం: గిల్

PBKSతో <<15888318>>మ్యాచులో<<>> తమకు లభించిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోలేకపోయామని GT కెప్టెన్ గిల్ అన్నారు. ‘బౌలింగ్‌లో చాలా పరుగులు ఇచ్చేశాం. ఫీల్డింగ్‌లోనూ తప్పులు చేశాం. ఛేజింగ్‌లో తొలి 3 ఓవర్లలో, ఇన్నింగ్స్ మధ్యలో మరో 3 ఓవర్లలో ఎక్కువ రన్స్ చేయకపోవడం వల్లే ఓడాం. పంజాబ్ బౌలర్ వైశాక్ యార్కర్లతో అద్భుతంగా బౌలింగ్ చేశారు. 15 ఓవర్ల తర్వాత ఇంపాక్ట్‌గా వచ్చి అలా బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదు’ అని పేర్కొన్నారు.