News March 24, 2025

జగిత్యాల: ఆ ప్రాంతంలో MLA ఉప ఎన్నికలు అనివార్యమేనా?

image

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. రేపు ఈ కేసును ధర్మాసనం విచారించనుంది. ఈ క్రమంలో జగిత్యాలలో BRS నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన సంజయ్ కుమార్‌పై అనర్హత వేటు పడుతుందా.. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. జగిత్యాలలో ఉప ఎన్నికలు జరుగుతాయా అని స్థానికంగా జోరుగా చర్చ నడుస్తోంది. దీనిపై మీ కామెంట్?

Similar News

News December 27, 2025

భీమిలికి పెరుగుతున్న వలసలు?

image

విశాఖ తీరానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని ప్రభుత్వం చెబుతుంటే, వలసదారులు అక్కడే వాలుతున్నాయి. ఉత్తరాంధ్రలో పారిశ్రామిక, IT పురోగతి పెరగడం మైగ్రేషన్‌ను పెరుగుతుందని గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గాల్లో 1,2 స్థానాల్లో భీమిలి, గాజువాకలు నిలిచాయి.ప్రస్తుతం భీమిలిలో 3,66,256 మంది ఓటర్లు ఉన్నారు. భీమిలి నియోజకవర్గంలో సగం అర్బన్, సగం గ్రామీణ వాతావరణం ఉంటుంది.

News December 27, 2025

జిల్లాలో ఖాళీల ఖిల్లా.. పండుగ వేళ పోలీసులకు సవాల్!

image

తూర్పుగోదావరి జిల్లాలో పండుగ వేళ శాంతిభద్రతల పరిరక్షణ సవాల్‌గా మారింది. కీలకమైన ఏఎస్పీ, డీఎస్పీ పోస్టులు ఖాళీగా ఉండటం విధి నిర్వహణపై ప్రభావం చూపుతోంది. రాజమండ్రిలో ముగ్గురు ఏఎస్పీలకు గాను ఎవరూ అందుబాటులో లేరు. ట్రాఫిక్, మహిళా పీఎస్, సెంట్రల్ డీఎస్పీ పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి. నూతన సంవత్సర, సంక్రాంతి వేడుకల వేళ సిబ్బంది కొరత పోలీసు శాఖను వేధిస్తోంది.

News December 27, 2025

GNT: కార్డన్ అండ్ సెర్చ్.. గంజాయి విక్రేతలపై ఉక్కుపాదం

image

గుంటూరు జిల్లాలో నార్త్ డీఎస్పీ మురళీకృష్ణ నేతృత్వంలో మంగళగిరి, ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో పాత గుంటూరు, సౌత్ డీఎస్పీ భానోదయ నేతృత్వంలో నల్లపాడు పరిధిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా 12 మంది రౌడీ షీటర్లు, 7 మంది సస్పెక్ట్ షీటర్లు, 7 మంది గంజాయి విక్రేతలకు కౌన్సిలింగ్ నిర్వహించి, సరైన పత్రాలు లేని 149 ద్విచక్ర వాహనాలు, 9 ఆటోలను సీజ్ చేశారు.