News March 24, 2025
జగిత్యాల: ఇంగ్లిష్ పరీక్షకు 8 మంది గైర్హాజరు

జగిత్యాల జిల్లాలో పదోతరగతి పబ్లిక్ పరీక్షలలో భాగంగా మూడోరోజు ఇంగ్లిష్ పేపర్ రెగ్యులర్ పరీక్షకు మొత్తం 11845 విద్యార్థులకు 11839 విద్యార్థులు హాజరయ్యారు. ఆరుగురు విద్యార్థులు గైర్హాజరయ్యారు. రెగ్యులర్ విద్యార్థుల హాజరు శాతం 99.95% ఉండగా.. సప్లమెంటరీ విద్యార్థులకు సంబంధించిన పరీక్ష కేంద్రాలలో 27 విద్యార్థులకు 25 మంది విద్యార్థులు గైర్హజరయ్యారు. వీరి హాజరుశాతం 85.19%. ఉంది అని అధికారులు తెలిపారు.
Similar News
News March 29, 2025
Xను విక్రయించిన ఎలాన్ మస్క్

తన సోషల్ మీడియా సంస్థ X(ట్విటర్)ను తన AI కంపెనీ xAIకు విక్రయించినట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఇందుకోసం xAI $45B చెల్లించనుంది. $12B అప్పు పోగా X విలువ $33Bగా ఉండనుంది. xAI వాల్యూ $80B అని మస్క్ పేర్కొన్నారు. ఇక నుంచి ఇవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయని, కలిసి పని చేస్తాయని తెలిపారు. ఈ కంబైన్డ్ కంపెనీ యూజర్లకు జ్ఞానంతో పాటు ఉపయోగకరమైన అనుభవాలను ఇస్తుందని పేర్కొన్నారు.
News March 29, 2025
కొడంగల్: నేడు సీఎం పర్యటన షెడ్యూల్

సీఎం రేవంత్ రెడ్డి నేటి కొడంగల్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది.√ సాయంత్రం 4:30 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో రానున్నారు.√ 4:40 గంటలకు హెలిప్యాడ్ నుంచి వెంకటేశ్వర ఆలయానికి రోడ్డు మార్గం ద్వారా వెళ్లనున్నారు.√ 4:40 నుంచి 5:40 వరకు స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొంటారు.√ సాయంత్రం 5.50 గంటల నుంచి 7 గంటల వరకు ఫంక్షన్ హాల్లో ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు.
News March 29, 2025
కరీంనగర్: ఉగాది నుంచి సన్నబియ్యం

ఉగాది నుంచి ప్రజలకు సన్నబియ్యం పంపిణి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రేషన్‌కార్డుల్లో పేర్లు నమోదై ఉన్న ప్రతి ఒక్కరికీ 6కిలోల చొప్పున బియ్యం సరఫరా చేయనున్నారు.కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,76,908 కుటుంబాలకు రేషన్ కార్డుల ద్వారా బియ్యం, నిత్యావసర వస్తువులను సరఫరా చేయనున్నారు. దీంతో 8,04,968 మంది సన్నబియ్యాన్ని పొందుతారు.