News March 1, 2025
జగిత్యాల : ఇంటర్ పరీక్షలు సజావు నిర్వహించాలి: సీఎస్

జిల్లాలో ఇంటర్ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎస్ శాంతికుమారి సూచించారు. శుక్రవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ బి. సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ బీఎస్ లతతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రశ్నపత్రాల తరలింపు పోలీస్ బందోబస్తు మధ్య నిర్వహించాలన్నారు. పరీక్ష కేంద్రంలోకి ఎవరికీ సెల్‌ఫోన్‌ను అనుమతించవద్దన్నారు.
Similar News
News July 6, 2025
వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా రామాంజి నేయులు

వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా గుంతకల్లుకు చెందిన జింకల రామాంజనేయులు నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. మాజీ సీఎం జగన్, జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వెంకటరామి రెడ్డికి రామాంజనేయులు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే స్థానిక ఎన్నికలలో వైసీపీ గెలుపు కోసం కృషి చేయాలని వెంకటరామిరెడ్డి ఆయనకు సూచించారు.
News July 6, 2025
కర్నూలు డీసీసీ ఇన్‌ఛార్జిగా లక్ష్మీ నరసింహ యాదవ్

కర్నూలు డీసీసీ ఇన్‌ఛార్జిగా నంద్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు లక్ష్మీ నర్సింహ యాదవ్‌ను అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు శనివారం ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి అంబటి రామకృష్ణ యాదవ్ స్థానంలో డీసీసీగా లక్ష్మీ నరసింహ యాదవ్‌ను నియమించడం పట్ల రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
News July 6, 2025
రెండ్రోజుల్లో శ్రీశైలం గేట్లు ఓపెన్!

AP: శ్రీశైలం రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు పోటెత్తుతోంది. జూరాల, సుంకేసుల నుంచి 1.88 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో క్రస్ట్ గేట్లు ఓపెన్ చేసేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 878 అడుగుల నీరు ఉంది. దీంతో 8, 9 తేదీల్లో గేట్లు ఓపెన్ చేసి దిగువకు నీరు విడుదల చేసే అవకాశం ఉంది.