News January 29, 2025
జగిత్యాల: ఇంటర్ ప్రాక్టికల్స్ సజావుగా జరిగేలా చూడాలి: అడిషనల్ కలెక్టర్

ఫిబ్రవరి 3 నుంచి జరగనున్న ఇంటర్ ప్రాక్టికల్స్ సజావుగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ గౌతమ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వివిధ డిపార్ట్మెంట్స్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్‌తో బుధవారం జరిగిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన సహాయ సహకారాలు వివిధ శాఖల అధికారులు అందించాలని పరీక్షల కన్వీనర్ నారాయణ కోరారు. కన్వీనర్ కోరినట్లు అన్ని ఏర్పాట్లు చేయాలని అడిషనల్ కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News July 5, 2025
నెల్లూరు: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

వరికుంటపాడు హైవేపై శుక్రవారం రాత్రి యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో దుత్తలూరు (M) కొత్తపేటకు చెందిన బర్రె రవి, తాళ్లూరి కృపానందం గాయపడ్డారు. తాళ్లూరి కృపానందం పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరు తరలిస్తుండగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బైక్ అదుపు తప్పిందా లేక గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టిందా అనే విషయంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
News July 5, 2025
అమెరికాలో కొత్త పార్టీ.. మస్క్ సన్నాహాలు!

‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ పాసైతే కొత్త పార్టీ పెడతానని మస్క్ ఇటీవల ప్రకటించారు. తాజాగా <<16891089>>బిల్ <<>>చట్టరూపం దాల్చడంతో ‘అమెరికా పార్టీ’ పెట్టడంపై మస్క్ హింట్ ఇచ్చారు. ‘2 లేదా 3 సెనేట్ సీట్లు, 8-10 హౌస్ డిస్ట్రిక్ట్స్‌లో ఫోకస్ చేస్తే ఫలితముంటుంది. ప్రజలకు మేలు చేస్తూ వివాదాస్పద చట్టాలపై నిర్ణయాత్మక ఓటు వేయడానికి ఈ సీట్లు సరిపోతాయి’ అని ట్వీట్ చేశారు. పార్టీ లాంచ్‌కు సిద్ధమవుతున్నారని వార్తలొస్తున్నాయి.
News July 5, 2025
అనకాపల్లి: ‘రోజుకు రూ.29 లక్షల ఆదాయం’

అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి దూర ప్రాంతాలకు ఎక్స్ ప్రెస్‌లు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని డీపీటీవో ప్రవీణ శుక్రవారం తెలిపారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎక్స్ ప్రెస్ బస్సులు కాంప్లెక్స్‌కు వచ్చే విధంగా ఈడీతో సంప్రదిస్తామన్నారు. జిల్లాలో అనకాపల్లి, నర్సీపట్నం బస్సు డిపోల ద్వారా రోజుకు రూ.29 లక్షల ఆదాయం వస్తోందన్నారు.