News September 20, 2025
జగిత్యాల: ‘ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో పురోగతి సాధించాలి’

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై జగిత్యాల కలెక్టరేట్ సమావేశం మందిరంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు జిల్లాలో 10,775 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయన్నారు. 7,261 మార్కౌట్, 2,569 బేస్మెంట్ స్థాయిలో, 428 గోడల నిర్మాణం వరకు 165 స్లాబ్ దశకు రాగ ఒక ఇళ్ళు నిర్మాణం పూర్తి చేసుకుందని కలెక్టర్ తెలిపారు.
Similar News
News September 20, 2025
కమ్యూనిటీ పోలీసింగ్‌కు ప్రాథన్యత ఇవ్వాలి: ఖమ్మం సీపీ

పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుల ఆధారంగా వెంటనే కేసులు నమోదు చేయాలని, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సీపీ సునీల్ దత్ ఆదేశించారు. శుక్రవారం ముదిగొండ, బోనకల్, చింతకాని పోలీస్ స్టేషన్ పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శిక్షల శాతం మరింత పెంచేందుకు అత్యున్నత ప్రమాణాలతో కేసుల దర్యాప్తు చేపట్టాలన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
News September 20, 2025
ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు

AP: రాయలసీమలో ఇవాళ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశముందని APSDMA తెలిపింది. కర్నూలు, నంద్యాల, ATP, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, TPT జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు-భారీ వర్షాలు, శ్రీకాకుళం, VZM, అల్లూరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, NTR, GNT, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి-మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుందని పేర్కొంది. SEP 26న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని తెలిపింది.
News September 20, 2025
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో పురోగతి సాధించాలి: కలెక్టర్

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో పురోగతి సాధించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు జిల్లాలో 10,775 ఇండ్లు మంజూరు కాగా 7,261 మార్కింగ్ చేయగా 2,569 బేస్మెంట్ స్థాయిలో 428 గోడల స్థాయిలో 165 స్లాబ్ దశలో ఉన్నాయని ఒక ఇల్లు పూర్తయిందనీ అధికారులు తెలిపారు. అడిషనల్ కలెక్టర్ తదితరులున్నారు.