News September 10, 2025

జగిత్యాల: ఇక భూములకు ప్రత్యేక భూధార్‌ కార్డులు

image

ప్రతి వ్యక్తికి జారీ చేసిన ఆధార్ కార్డు లాగ, ఇక ప్రతి భూమికి భూధార్ కార్డును జారీ చేయనున్నారు. దీని ఆధారంగా భూమి సర్వే నంబర్లు, విస్తీర్ణం, సరిహద్దులు, ఏ విధంగా సంక్రమించింది, బీమా, బ్యాంకు రుణాల వంటి వివరాలను ఇందులో నమోదు చేయనున్నారు. దీంతో నకిలీ డాక్యుమెంట్ల, ఒకే భూమిని పలువురికి రిజిస్ట్రేషన్ చేయడం కుదరదు. జగిత్యాల జిల్లాలో మెత్తం 2,48,550 మంది రైతులు ఉండగా, 4,18,569 ఎకరాల సాగుభూమి ఉంది.

Similar News

News September 10, 2025

అమ్మాయిలకి ఈ టెస్టులు చేయించండి..

image

ఆడపిల్లలున్న తల్లిదండ్రులు వారు రజస్వల అయినప్పటి నుంచి వారికి కొన్ని ఆరోగ్య పరీక్షలు కచ్చితంగా చేయించాలంటున్నారు నిపుణులు. రక్తహీనత సమస్యను గుర్తించడానికి కంప్లీట్ బ్లడ్ కౌంట్(సీబీసీ) పరీక్ష, హార్మోన్ల అసమతుల్యతను గుర్తించడానికి థైరాయిడ్, హార్మోన్ల పరీక్షలు, విటమిన్‌ప్రొఫైల్‌ టెస్ట్‌, ఏవైనా మూత్ర సంబంధిత సమస్యలుంటే మూత్ర పరీక్ష చేయించాలి. వీటివల్ల ఏవైనా సమస్యలుంటే ముందుగానే గుర్తించే వీలుంటుంది.

News September 10, 2025

మెదక్: తొమ్మిది నెలల్లో 648 మంది సూసైడ్

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు వివిధ కారణాలతో 648 మంది ఆత్మహత్య చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో 204, మెదక్‌లో 228, సిద్దిపేటలో 216 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల రికార్డులు తెలుపుతున్నాయి. ప్రతి సమస్యకు ఆత్మహత్య పరిష్కారం కాదని, ధైర్యంగా ఎదుర్కోవాలని సైకాలజిస్టులు సూచిస్తున్నారు.

News September 10, 2025

రాజాంలో రేపు జాబ్ మేళా

image

రాజాం ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రశాంతకుమార్ తెలిపారు. 10th, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఏదైనా పీజీ చదివి వయసు 18-35లోపు ఉన్న యువతీ, యువకులు అర్హులన్నారు. 12 బహుళజాతి కంపెనీలు జాబ్ మేళాకు హాజరవుతున్నాయని, ఆసక్తి ఉన్నవారు https://naipunyam.ap.gov.in వెబ్ సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.