News February 28, 2026
జగిత్యాల: ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ.. నిలువు దోపిడి

జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన ఒక మహిళకు విజయవాడకు చెందిన వంశీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళను వేములవాడకు రప్పించాడు. ఇద్దరూ కలిసి స్థానిక ప్రైవేట్ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు. ఆ మహిళ బాత్రూమ్‌కి వెళ్లిన సమయంలో ఆమె బ్యాగులో ఉన్న 3తులాల బంగారు గొలుసుతో పాటు రూ.10వేలు తీసుకొని పరారయ్యాడు. దీంతో బాధిత మహిళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
Similar News
News February 28, 2026
కాకినాడ రానున్న డిప్యూటీ CM పవన్ కళ్యాణ్

సామర్లకోట మండలం వేట్లపాలెం బాణసంచా ప్రమాద బాధితులను పరామర్శించేందుకు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం రాత్రి కాకినాడ చేరుకోనున్నారు. ముందుగా మృతదేహాలను పరిశీలించిన అనంతరం ఆయన కాకినాడలోని ప్రైవేట్ హోటల్‌లో బస చేస్తారు. ఆదివారం ఉదయం కాకినాడ GGHలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి వారికి భరోసా ఇవ్వనున్నారు. డిప్యూటీ CM పర్యటన కోసం అధికారులు పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు.
News February 28, 2026
మెదక్: ఇన్‌ఛార్జ్ మంత్రిని కలిసిన కలెక్టర్!

మెదక్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామిని కలెక్టర్ ప్రతిమా సింగ్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. మూడు రోజుల క్రితమే కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమె, మంత్రికి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని మంత్రి సూచించారు. ప్రభుత్వంపై నమ్మకం వమ్ము చేయకుండా బాధ్యతలు నిర్వర్తిస్తానని కలెక్టర్ తెలిపారు.
News February 28, 2026
SVUలో వివిధ పరీక్ష ఫలితాల విడుదల.!

SVU పరిధిలో గత ఏడాది ఆగస్టులో బీఫార్మసీ మొదటి సెమిస్టర్, ఏప్రిల్‌లో M.A ఇంగ్లిష్/ హిస్టరీ/ ఫిలాసఫీ/ సాంస్క్రిట్/ తమిళ్/ సోషియాలజీ, M.Com రెండో సెమిస్టర్, SVU DDE పరిధిలో ఎంఎస్సీ (M.Sc) కెమిస్ట్రీ మొదటి సంవత్సరం పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ రాజమాణిక్యం తెలియజేశారు. ఫలితాలను https://www.manabadi.co.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోగలరు.


