News September 12, 2025

జగిత్యాల: ఈనెల 20న క్రీడా పోటీలు

image

జగిత్యాల యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని మినీ స్టేడియంలో ఈనెల 20న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జిల్లా క్రీడాకారులకు పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి తెలిపారు. క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ పోటీలతోపాటు ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు నిమ్మకాయ చెంచా, మ్యూజికల్ ఛైర్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గెలుపొందిన వారికి బహుమతులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News September 12, 2025

సంగారెడ్డి: ఉన్నత చదువులకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ

image

సంగారెడ్డి జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు ఉన్నత చదువులు చదివేందుకు అనుమతినిస్తూ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. డీఈఓ మాట్లాడుతూ.. జిల్లాలో 19 మంది ఉపాధ్యాయులు ఉన్నత చదువులు చదివేందుకు దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు.

News September 12, 2025

HNK: కాంట్రాక్టర్లకు నోటీసులు ఇవ్వండి: కలెక్టర్

image

ప్రాథమిక, ఉప ఆరోగ్య కేంద్రాల నిర్మాణంలో జాప్యం చేసే కాంట్రాక్టర్లకు వెంటనే నోటీసులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీవోసీ కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఆసుపత్రుల నిర్మాణ పనులు, వైద్య సిబ్బంది సమయపాలన, ఖాళీ పోస్టుల భర్తీ తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు.

News September 12, 2025

ములుగు: సాదా బైనామా దరఖాస్తులను పరిష్కరించాలి: కలెక్టర్

image

సాదా బైనామా దరఖాస్తులను పరిశీలించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర అధికారులను ఆదేశించారు. తహశీల్దార్, రెవెన్యూ అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన సాదా బైనామా దరఖాస్తులకు నోటీసులు ఇచ్చి సర్వే పూర్తి చేయాలని సూచించారు. నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీం, గ్రీవెన్స్ దరఖాస్తుల పరిశీలన, ధ్రువీకరణను వేగవంతం చేయాలన్నారు.