News March 6, 2025
జగిత్యాల: ఈవీఎం గోదాం కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్న ఈవీఎం గోడౌన్‌ను ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ గురువారం తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రతకు సంబంధించి ప్రతి నెల తనిఖీలలో భాగంగా గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, ఆర్డిఓ మధుసూదన్, తాసిల్దార్ రామ్మోహన్ తదితరులు ఉన్నారు.
Similar News
News July 7, 2025
కాకినాడ JNTUకు కొత్త అధికారులు

కాకినాడ జేఎన్టీయూ ఇన్‌ఛార్జ్ రెక్టార్, రిజిస్ట్రార్‌లను నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. యూసీఈకే ఈఈఈ విభాగంలో పనిచేస్తున్న శ్రీవినాసరావు ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో పనిచేస్తున్న సుబ్బారావు ఇన్‌ఛార్జ్ రెక్టార్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు వారిని వీసీ ప్రసాద్ అభినందించారు.
News July 7, 2025
ఉమ్మడి నల్గొండలో డీసీసీ పదవులకు తీవ్ర పోటీ.!

ఉమ్మడి NLG జిల్లా రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమే. తాజాగా జిల్లాలో DCC అధ్యక్ష పదవులపై ఉత్కంఠ నెలకొంది. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో DCC కీలకం కానుండటంతో పదవుల కోసం నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల నుంచి ఒక్కో జిల్లాలో ఇద్దరు, ముగ్గురు నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. నేతలు ఇప్పటికే పైరవీలు మొదలు పెట్టారు. సామాజిక సమీకరణాల దృష్ట్యా ఎంపికలు ఉండే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
News July 7, 2025
MNCL: 45 లక్షల మొక్కలు నాటేందుకు సింగరేణి సిద్ధం

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవంలో భాగంగా సింగరేణి వ్యాప్తంగా 45 లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంస్థ సీఅండ్ఎండీ బలరాం తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, పచ్చదనం పెంపొందించేందుకు ఖాళీ ప్రదేశాల్లో కనీసం మూడు మొక్కలను నాటి సంరక్షించాలని కోరారు. సింగరేణి సంస్థ ఇప్పటికే 14 వేల హెక్టార్లలో ఏడు కోట్లకు పైగా మొక్కలను నాటిందని పేర్కొన్నారు.