News February 14, 2026

జగిత్యాల : ఈ అభ్యర్థులు ఓటు వేసుకోలేరా??

image

మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకున్నాయి. మెట్పల్లిలో నలుగురు, కోరుట్లలో ఇద్దరు మున్సిపల్ అభ్యర్థులు తమ ఓటు సైతం ఇతరులకు వేసినట్టున్నారు. కోరుట్ల పట్టణంలో 7వ వార్డు లోకిని రవి, 31వ వార్డు నన్నపనేని సేనాపతిరాజు, మెట్పల్లి పట్టణంలో 2వ వార్డు యామ గాయత్రి, 17వ వార్డు తోకల శ్రీరాములు, దుర్గం రాజశేఖర్, 18వ వార్డు లక్ష్మీ దుర్గం సున్నా ఓట్లు వచ్చాయి.

Similar News

News February 20, 2026

ADB: నాడు అక్బరుద్దీన్.. నేడు బాల్క సుమన్

image

జిల్లా జైలుకు మరోమారు రాష్ట్ర స్థాయి నేత రిమాండ్‌పై వచ్చారు. గతంలో ద్వేషపూరిత ప్రసంగాల కేసులో జనవరి 8 2013లో అక్బరుద్దీన్ ఒవైసీ 40 రోజుల పాటు ఇక్కడ రిమాండ్‌లో ఉన్నారు. తాజాగా క్యాతన్‌పల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక గొడవల నేపథ్యంలో మాజీ ఎంపీ బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి ఇదే జైలుకు తరలించారు. అక్బరుద్దీన్ సుదీర్ఘ కాలం ఇక్కడ ఉండగా, సుమన్ ఎన్ని రోజులు ఉంటారోనని చర్చ మొదలైంది.

News February 20, 2026

బొబ్బిలి: గంజాయితో పట్టుబడ్డ విద్యార్థులు?

image

బొబ్బిలి మండలం ఓ గ్రామంలో గురువారం గంజాయితో విద్యార్థులు పట్టుబడినట్లు సమాచారం. కళాశాల వద్ద గంజాయి తాగుతున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో దాడి చేసి నలుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకొని 4 కిలోల గంజాయి సీజ్ చేసినట్లు తెలుస్తోంది. జల్సాలకు అలవాటు పడ్డ సీనియర్ విద్యార్థులే ఒడిశా నుంచి గంజాయి తెచ్చి అమ్ముతున్నట్లు చర్చ జరుగుతుంది. పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.

News February 20, 2026

తల్లిదండ్రుల చెంతకు చేరిన చిన్నారులు

image

తిరుమలలో అపహరణకు గురైన ఇద్దరు చిన్నారులను పోలీసులు తల్లిదండ్రుల వద్దకు చేర్చారు తణుకునకు చెందిన లక్ష్మీ,రాంబాబు దంపతులు తమ కుమార్తెలు నవదుర్గ, అశ్వినీలతో ఈ నెల 16న తిరుమల వచ్చారు. బాలికలు ఆడుకుంటూ ఉండగా అన్నమయ్య జిల్లాకు చెందిన గుండ్లూరు శివమ్మ వారిని అపహరించి తన వెంట తీసుకుపోయింది. తిరుమల పోలీసులు సిసి ఫుటేజీలను పరిశీలించి 17న కొవ్వూరు రైల్వేస్టేషన్లో అదుపులోకి తీసుకుని చిన్నారులను అప్పగించారు.