News October 21, 2025
జగిత్యాల: ఉరివేసుకొని యువకుడి సూసైడ్

జగిత్యాల(D) ధర్మపురి మండలం దమ్మన్నపేటకి చెందిన జగిశెట్టి సచిన్(29) ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. సచిన్‌కు చిన్నతనంలో చేతికి తగిలిన గాయం కారణంగా ప్రస్తుతం ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నాడు. ఇందుకోసం హైదరాబాద్‌లో వైద్యం చేయించారు. 6 నెలల వరకు ఫిజియోథెరపీ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే అనారోగ్యం కారణంతో సచిన్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Similar News
News October 21, 2025
పేదల సంక్షేమం కోసమే ఇందిరమ్మ ప్రభుత్వం: మంత్రి పొంగులేటి

రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసమే ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కూసుమంచి(M) ధర్మతండాలో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దుల వలే నడిపిస్తున్నామని చెప్పారు. పల్లెల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ పాల్గొన్నారు.
News October 21, 2025
ఆసుపత్రికి చెవిరెడ్డి తరలింపు

చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మద్యం కేసులో రిమాండ్ పడటంతో విజయవాడ జైలులో ఉన్నారు. ఇటీవల ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పంటి సమస్య ఇబ్బంది పెట్టడంతో విజయవాడలోని గవర్నమెంట్ డెంటల్ హాస్పిటల్‌కు చెవిరెడ్డిని తరలించారు. చికిత్స అనంతరం జైలుకు తీసుకెళ్లనున్నారు.
News October 21, 2025
దుబాయ్‌లో పెట్టుబడిదారులతో పెద్దపల్లి MP భేటీ

రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకు రావాలనే లక్ష్యంతో పెద్దపల్లి MP గడ్డం వంశీకృష్ణ దుబాయ్‌లో ప్రముఖ పెట్టుబడిదారులతో మంగళవారం సమావేశమయ్యారు. రాష్ట్రంలోని మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలు పారిశ్రామిక పెట్టుబడుల కోసం అత్యంత అనుకూలమైన ప్రాంతాలని MP వివరించారు. బొగ్గు, విద్యుత్, రైల్వే, రోడ్లు వంటి మౌలిక వసతులు ఉన్న ఈ ప్రాంతాలలో పెట్టుబడులు పెడితే వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.